Shani Gochar: కొత్త సంవత్సరంలో త్వరలో రాశిని మార్చుకోనున్న శనీశ్వరుడు.. ఈ రాశులకు అపారమైన ఆర్ధిక ప్రయోజనాలు..
నవ గ్రహాల్లో శనీశ్వరుడు ఒక గ్రహం. కర్మ ఫలితాలను ఇచ్చే శనీశ్వరుడు కొత్త సంవత్సరంలో మీన రాశిలో సంచరించబోతున్నాడు. ఈ సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేసినప్పటికీ, కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు శనీశ్వరుడి సంచారము ఆనందాన్ని కలిగిస్తుంది. శనీశ్వరుడు ఎప్పుడు? ఏ రాశుల వారికి లాభం చేకూరుస్తాడో తెలుసుకుందాం.
శనీశ్వరుడు అన్ని గ్రహాలలో అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణించబడుతుంది. వ్యక్తి చేసిన కర్మలను బట్టి తగిన ఫలితాలను ఇస్తాడని అంటారు. అన్ని గ్రహాల మాదిరిగానే.. శనీశ్వరుడు కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాడు. ఇది మొత్తం 12 రాశుల వ్యక్తులపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. ఈసారి మీనరాశిలో శనీశ్వరుడు సంచారంతో కొన్ని రాశుల వారికీ అదృష్టం కలుగుతుంది.
శనీశ్వరుడు సంచారం ఎప్పుడంటే
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు 2025 డిసెంబర్ నెలలో పూర్వాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్రంలో శనీశ్వరుడు 28 ఏప్రిల్ 2025 వరకు ఉండబోతున్నాడు. దీనితో పాటు శనీశ్వరుడు మార్చి 29, 2025 న మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు.
ఎవరికి గోల్డెన్ టైమ్ ప్రారంభమవుతుందంటే
మేష రాశి: మీన రాశిలో శనీశ్వరుడు సంచారం మేష రాశి వారికి బంగారు రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందవచ్చు. ఏ రంగంలో అయినా కష్టపడి పని చేస్తే ఫలితం ఉంటుంది. వ్యాధి నుంచి, బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో వ్యక్తిగత జీవితం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనితో పాటు, ఉద్యోగం, వ్యాపారంలో ఆశించిన విజయాన్ని సాధించవచ్చు.
మిథున రాశి: ఈ రాశి వారికి మీనరాశిలో శనిదేవుని సంచారం శుభప్రదం అవుతుంది. ఈ కాలంలో మిథునరాశి వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ధనలాభం ఉంటుంది. దీంతో అవివాహితులకు వివాహ అవకాశాలు ఉన్నాయి. సమాజం నుంచి ప్రశంసలు పొందడంతో పాటు ఈ రాశికి చెందిన వ్యక్తులు కొన్ని కొత్త బాధ్యతలను కూడా పొందవచ్చు. అదే సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్‌తో పాటు జీతం కూడా పెరుగుతుంది.
కన్య రాశి: రాశికి చెందిన వారికి కూడా శనిశ్వరుడి సంచారం చాలా అదృష్టమని రుజువు చేస్తుంది. శనిశ్వరుడి ఈ రాశిలో ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు. ఈ కాలంలో కన్యా రాశి వారు కొత్త ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇది అపారమైన సంపదను ఇస్తుంది. అంతే కాదు నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.