AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు బంగారు బొమ్మలు ఎలా మనసు వచ్చింది అమ్మా.. కవల పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి.. చనిపోతూ ఏమి చెప్పిందంటే..

మాతృత్వం ఓ వరంగా భావిస్తుంది ఆడది.. తన పేగు తెచుకుని తన రక్తం పంచుకుని పుట్టిన తన పిల్లలు పెరిగి పెద్దయ్యి.. మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటుంది.. అందు కోసం ఎన్ని త్యాగాలను అయినా చేస్తుంది. అయితే రాజస్తాన్ లో ఓ తల్లి మాత్రం తన కవల పిల్లల పెంపకంలో అలసి పోతున్నానని భావించింది. ఘోరమైన నిర్ణయం తీసుకుంది. తల్లి తన కవల కొడుకులకు పాలలో విషం కలిపి ఇచ్చింది. ఆ తర్వాత తానూ విషం సేవించింది. వెంటనే ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ముందు చిన్నారుద్దరూ మరణించగా.. తర్వాత తల్లి మరణించింది. తల్లి చనిపోయే ముందు ఇలా ఎందుకు చేసిందో చెప్పింది..

పిల్లలు బంగారు బొమ్మలు ఎలా మనసు వచ్చింది అమ్మా.. కవల పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి.. చనిపోతూ ఏమి చెప్పిందంటే..
Rajasthan News
Surya Kala
|

Updated on: Jan 03, 2025 | 8:38 AM

Share

తల్లి తన బిడ్డలను శత్రువుగా భావించి అది కూడా అభం శుభం తెలియని చిన్నారుల పెంపకంలో అలసి పోయానని భావించి వారిని చంపాలని ఏ తల్లి అయినా కోరుకుంటుందా అంటే ఇది విన్న తర్వాత ఎవరైనా సరే నో చెబుతారు. అయితే రాజస్థాన్‌లో ఓ మహిళ మమతను మరచింది.. తన రెండున్నరేళ్ల కవల కొడుకులను చేతులారా విషం ఇచ్చి చంపేసింది. ఆ తర్వాత తానూ విషం తీసుకుంది. చికిత్స పొందుతూ ఆ తల్లి కూడా మృతి చెందింది. ఈ విషాద ఘటన సిరోహి జిల్లాలోని శివగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివగంజ్ ప్రాంతంలో నివసిస్తున్న తల్లికి తన కవల కొడుకులు అంటే ఇష్టం లేదు. వారిని చూసుకోవడంలో తాను అలసిపోతున్నట్లు భావించింది. అందుకే పాలలో విషం కలిపి ఇద్దరికీ తాగించింది. ఆ తర్వాత తానూ కూడా ఆ విషం సేవించింది. ఈ ఘటనలో ముందు పిల్లలు మృతి చెందగా.. ఆ తర్వాత ఆ కసాయి తల్లి కూడా మరణించింది.

ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ… మృతురాలి పేరు రేఖ..భర్త పేరు యోగేష్ చింపా… రేఖ తన తల్లితో కలిసి ఉంటున్నట్లు విచారణలో తేలిందన్నారు. పాలి జిల్లాలోని సేవడిలో నివసిస్తుంది. రేఖకు పూర్వంష్ , పూర్విత్ అనే ఇద్దరు 1.25 సంవత్సరాల కవల కుమారులు ఉన్నారు. భర్త మహారాష్ట్రలో టైలరింగ్‌ పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం రేఖ తన కుమారులిద్దరికీ విషం ఇవ్వడమే కాదు తను కూడా విషం తాగింది. దీంతో ముగ్గురూ చనిపోయారు. ఈ హత్య, ఆత్మహత్య ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

చనిపోయే ముందు రేఖ ఏమి చెప్పిందంటే

మృత్యువుతో పోరాడుతున్న రేఖని ఆస్పత్రిలో చేరడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రేఖ వాంగ్మూలాలు తీసుకున్నారు. తన కవలపిల్లలను పెంచడానికి ఇబ్బంది పడుతున్నానని.. అందుకనే వారిని చంపి.. తాను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. తాను వేసుకున్న ప్లాన్ ను అమలు చేయడానికి.. విషం రెడీ చేసుకుని.. తన ప్లాన్ ప్రకారం తల్లిని బుధవారం మధ్యాహ్నం తల్లిని బయటకు పంపింది. తర్వాత పిల్లలకు విషం ఇచ్చి.. ఆపై తాను తీసుకుంది. కొడుకుల మరణవార్త విన్న తండ్రి యోగేష్ గుండె పగిలేలా ఏడుస్తున్నాడు.

ముగ్గురిని ఆస్పత్రికి తరలించిన రేఖ తల్లి

రేఖ తల్లి బయటి నుంచి వచ్చేసరికి ఇంట్లో ముగ్గురూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. అది చూసి రేఖ తల్లి ఒక్కసారిగా షాక్ తిండి.. భయంతో ఒక్కసారిగా బిగ్గరగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చారు. అనంతరం ముగ్గురినీ పాలీ జిల్లాలోని సుమెర్‌పూర్‌లో ఉన్న మహావీర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పిల్లలిద్దరూ అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. రేఖను జాయిన్ చేసుకున్నారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం రేఖ కూడా ఎమర్జెన్సీ వార్డులో మృతి చెందింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..