Cafe Owner Suicide: మరో భార్య బాధితుడు బలి.. భార్య, అత్తవారింటి వేధింపులను తట్టుకోలేక పునీత్ ఆత్మహత్య
యువతులకు, వివాహిత స్త్రీలను వేధింపులకు గురిం చేసినా.. లేదా అత్తింట స్త్రీలు భర్త, ఆడబడుచు, అత్త వేధింపులకు గురిచేసినా చట్టాలున్నాయి. అందుకు తగిన శిక్షలున్నాయి. అయితే ఇప్పుడు మేము మాత్రమే ఏమి తక్కువ అంటూ భార్యలు కూడా తమ భర్తలు వేధింపులకు గురించి చేస్తున్నారు. తాజాగా భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు.. బెంగళూర్‌లో అతుల్ సుభాష్ ఆత్మహత్య సంఘటనను మరవకముందే ఢిల్లీలో పునీత్ ఖురానా అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.. పునీత్ తన భార్య మానికా వేధింపుల వల్లే చనిపోయాడని పేరంట్స్ ఆరోపిస్తున్నారు.
దేశంలో భార్య బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. బెంగళూరులో టెకీ అతుల్ సుభాశ్ ఆత్మహత్య ఘటన మరిచిపోక ముందే ఢిల్లీలో మరో భార్య బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఢిల్లీలో ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. ఉడ్‌బాక్స్ కేఫ్ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. . కళ్యాణ్ విహార్ ప్రాంతం మోడల్ టౌన్‌లో నివాసం ఉంటోన్న పునీత్.. తన గదిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పునీత్ ఖురానా, ఆయన భార్య మానికా జగదీశ్ పహ్వా మధ్య విడాకుల కేసు నడుస్తుండగా.. వ్యాపారం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు నడుస్తున్నాయి.
కేఫ్ యాజమాన్యం విషయంపై ..పునీత్, మానికా మధ్య గొడవలు
ఉడ్‌బాక్స్ కేఫ్ యాజమాన్యం విషయంపై పునీత్, మానికా మధ్య గొడవలు జరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. భార్య వేధింపులతోనే తమ కుమారుడు బలవన్మరణానికి పాల్పడినట్టు పునీత్ కుటుంబసభ్యులు ఆరోపించారు. పునీత్, మానికాకు 2016లో పెళ్లి జరిగింది. ఖురానా, మానికా మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన 16 నిమిషాల ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ఆడియోలో ఇరువురి మధ్య బిజినెస్ ప్రాపర్టీ గురించి జరిగిన వాగ్వాదం రికార్డయ్యింది. ‘మనం విడాకులు తీసుకున్నాం.. కానీ, నేను ఇంకా వ్యాపార భాగస్వామినే.. నాకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందే’ అని పునీత్‌ను మానికమె డిమాండ్ చేయడం స్పష్టంగా వినిపిస్తోంది.
పునీత్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పునీత్ భార్యను విచారణకు హాజరుకావాలని నోటీసు పంపారు. తమ కుమారుడిని మానికా చాలా వేధించింనట్టు పునీత్ పేరంట్స్ ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం కావాలని వాళ్లు వేడుకుంటున్నారు.
ఏడాది వరకు ఇద్దరు బాగానే ఉన్నారు. తరువాత గొడవలు ప్రారంభమయ్యాయి. తన బిడ్డను చాలా టార్చర్ చేసింది.. ఎంతో మానసిక వేదన అనుభవించాడు.. డబ్బుల గురించి , బిజినెస్ గురించి గొడవలు జరిగాయి.. అయితే తన కొడుకు ఎప్పుడు తన బాధను తమకు చెప్పలేదని తల్లిదండ్రులు చెప్పారు. తాము టెన్షన్ పడుతామని చెప్పేవాడు కాదు.. లోలోన చాలా బాధపడ్డాడని చెప్పారు. తన భార్య పెట్టే టార్చర్ భరించలేకే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కొడుకు మరణించాడు.. తమకు న్యాయం కావాలంటూ పునీత్ తల్లిదండ్రులు చెబుతున్నారు.
గత డిసెంబరు మొదటి వారంలో బిహార్‌కు చెందిన అతుల్ సుభాష్.. బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య నికిత సింఘానియా, ఆమె కుటుంబసభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు అతుల్ 24 పేజీల సూసైడ్ లెటర్ రాసి.. దానిని హైకోర్టు, తాను పనిచేసే ఆఫీసు, తల్లిదండ్రులకు మెయిల్ చేశాడు. న్యాయవ్యవస్థపై కూడా అతుల్ ఆరోపణలు చేయడం.. విడాకుల కేసు విచారించిన జడ్జి తనను రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్టు ఆరోపించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలన రేపింది. ఈ కేసులో అతుల్ భార్య నికిత, ఆమె తల్లి, సోదరుడ్ని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మరవక ముందే ఢిల్లీలో పునీత్ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..