JEE Main 2025 Exam Date: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షల తేదీలు ఇవే.. మరో రెండు వారాల్లో అడ్మిట్‌ కార్డులు

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) 2025 జవనరి సెషన్‌ పరీక్షల తేదీలను ఎన్టీయే విడుదల చేసింది. మొత్తం రెండు సెషన్లలో జరిగే జేఈఈ మెయిన్ పరీక్షలు తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక తొలి దశకు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఏకంగా 13.8 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు..

JEE Main 2025 Exam Date: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షల తేదీలు ఇవే.. మరో రెండు వారాల్లో అడ్మిట్‌ కార్డులు
JEE Main 2025 Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 02, 2025 | 8:03 AM

హైదరాబాద్‌, జనవరి 2: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) 2025 జవనరి సెషన్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలకు దాదాపు 13.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదికంటే గరిష్ఠంగా ఈ ఏడాది దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగా దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 ఆన్‌లైన్‌ పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) బుధవారం ప్రకటించింది.

ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌ 1 పరీక్ష నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఇక బీఆర్క్, బీప్లానింగ్‌ సీట్ల భర్తీకి పేపర్‌ 2ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష జనవరి 30న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్వహిస్తారు. హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు విడుదల చేయనున్నారు. ఇక జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్టీఏ షెడ్యూల్‌ ప్రకటించింది. జనవరి 19 నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

సీటెట్‌ కీ, ఓఎంఆర్‌ ఆన్సర్‌ షీట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్ (2024) ఆన్సర్‌ కీ విడుదలైంది. డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా సీటెట్‌ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్‌ ఆన్సర్‌ షీట్లు, కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. జనవరి 1 నుంచి 5వ తేదీ అర్ధరాత్రి 11.59గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఆన్సర్‌ కీలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ గడువులోగా తెలియజేయాలని పేర్కొంది. అయితే ఒక్కో ప్రశ్నకు రూ.1000 చొప్పున (నాన్‌-రిఫండ్‌) చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు సరైనవైతే వారు చెల్లించిన మొత్తాన్ని రిఫండ్‌ చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ ఆన్సర్ కీ రూపొందిచి ఆ తర్వాత త్వరలోనే సీటెట్‌ ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ కోసం అభ్యర్థులు తమ రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. సీటెట్‌ స్కోరును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్‌ స్కోర్‌కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సీటెట్‌ కీ, ఓఎంఆర్‌ ఆన్సర్‌ షీట్లు డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.