AP Job Calendar 2025: నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఏడాది కొత్తగా 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీ! జాబ్ క్యాలెండర్ వచ్చేస్తోంది..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 18 శాఖల్లో ఉద్యోగ నోటిఫికేషన్లను ఈ ఏడాది ఇవ్వనుంది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ జారీ చేయనున్నట్లు తెలిపింది. జాబ్ క్యాలెండర్ లో శాఖల వారీగా పోస్టుల వివరాలు, రాత పరీక్ష తేదీలతోపాటు ఇప్పటికే విడుదల చేసిన పలు నోటిపికేషన్ల రాత పరీక్ష తేదీలను కూడా వెల్లడించనుంది..

AP Job Calendar 2025: నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఏడాది కొత్తగా 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీ! జాబ్ క్యాలెండర్ వచ్చేస్తోంది..
AP Job Calendar 2025
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 02, 2025 | 7:47 AM

అమరావతి, జనవరి 2: కూటమి సర్కార్‌ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. తాజాగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏపీపీఎస్సీ ద్వారా ‘జాబ్‌ క్యాలెండర్‌’ విడుదలకు చర్యలు తీసుకుంటోంది. ఈ జాబ్‌ క్యాలెండర్‌లో ఈ ఏడాది భర్తీ చేయనున్న కొత్త పోస్టుల వివరాలతోపాటు ఇప్పటికే విడుదల చేసిన 20 రకాల నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల నిర్వహణ తేదీలు ప్రకటిస్తుంది. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 866 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి 18 రకాల నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. అటవీ శాఖలోనే దాదాపు 814 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ అనంతరం ఈ నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కొత్త నోటిఫికేషన్ల జారీకి అనుగుణంగా వాటి రాత పరీక్షల తేదీలు సైతం ఖరారు చేస్తారు.

వీటితోపాటు దివ్యాంగుల సంక్షేమశాఖలో వార్డెన్, గనుల శాఖ- రాయల్టీ ఇన్‌స్పెక్టర్, ఫ్యాక్టరీ సర్వీసెస్‌లో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్, బీసీ వెల్ఫేర్‌లో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, జైళ్లశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌-టైపిస్టు, రవాణా శాఖలో ఏఎంవీఐ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇస్తామని సర్కార్ తెలిపింది.

డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (పాఠశాల విద్యాశాఖ), ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్, ఎనలిస్టు గ్రేడ్‌-2 (పర్యావరణ శాఖ), అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ (ఎన్టీఆర్‌ వర్సిటీ), జూనియర్‌ అసిస్టెంట్‌ (ఎన్టీఆర్‌ వర్సిటీ), ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌), లైబ్రేరియన్‌ (ఆరోగ్యశాఖ), అసిస్టెంట్‌ ట్రైబల్‌ ఆఫీసర్, దివ్యాంగుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్, ఏపీ భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ కెమిస్ట్, ఏపీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌ సర్వీసెస్‌లో అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఆర్థిక, గణాంకాల శాఖ), ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులన్నింటికీ 2025 మార్చి చివరి నుంచి ఇదే ఏడాది జూన్‌ నెలాఖరులోగా పరీక్షలు నిర్వహించేలా తేదీలు ఖరారు చేస్తున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలను 2025 ఏప్రిల్‌ తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. గ్రూప్‌-2 మెయిన్‌ పరీక్ష 2025 ఫిబ్రవరి 23న నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు రాతపరీక్షలను 2025 జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.