Telangana: గురుకుల విద్యాలయాల్లో మృత్యుఘోష.. ఖమ్మంలో మరో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాలు విద్యార్ధుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నాయి. ఇప్పటికే పలువురు విద్యార్ధుల ప్రాణాల్లోగాల్లోకలిసిపోగా.. తాజా మరో ఇద్దరు విద్యార్ధులు మరణించారు. ఖమ్మం జిల్లాలోని వేర్వేరు గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకుని మరణించడం కలకలం రేపుతుంది..

Telangana: గురుకుల విద్యాలయాల్లో మృత్యుఘోష.. ఖమ్మంలో మరో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య
Gurukula Students
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 01, 2025 | 11:28 AM

ఖమ్మం, జనవరి 1: తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో మరణమృదంగం మోగుతోంది. ఇప్పటికే పలువురు విద్యార్ధులు పాముకాట్లు, కలుషిత ఆహారం వల్ల బలైతే.. తాజాగా మరో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఒకరు కళాశాలలోనే ఉరి వేసుకోగా, మరోచోట ఎలుకల మందుతాగి ప్రాణాలు విడిచాడు. ఖమ్మం జిల్లాలో వేరువేరు గరుకులాల్లో ఈ దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన మాడుగుల సాయివర్ధన్‌ (17) మధిర మండలం కృష్ణాపురం సోషల్‌ వెల్ఫేర్‌ బాలుర జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. క్రిస్మస్‌ సెలవులకు ఇంటికి వెళ్లిన సాయివర్ధన్‌.. సోమవారం మధ్యాహ్నం హాస్టల్‌కు వచ్చాడు. తోటి విద్యార్థులతో రాత్రి 10 గంటల వరకు కలిసే ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోయిన తర్వాత హాస్టల్‌ పైఅంతస్తులోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున హాస్టల్‌ సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

ఎలుకల మందు తాగి చింతగుర్తి గరుకుల విద్యార్ధి ఆత్మహత్య

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తికి చెందిన కుక్కల భార్గవ్‌ (17) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్‌ సెకండ్ ఇయర్‌ చదువుతున్నాడు. క్రిస్మస్‌ సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన భార్గవ్‌ను తిరిగి హాస్టల్‌కు వెళ్లాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన భార్గవ్‌ డిసెంబర్‌ 27న ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు గమనించి వెంటనే దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. గురుకుల విద్యార్ధుల వరుస మరణాలపై ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, డీవైఎఫ్‌ఐ, ఎంఎస్‌ఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు మరణిస్తున్నారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం