AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad News: ఇవాళ రాత్రి నగరంలో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు.. ప్లైఓవర్లన్నీ క్లోజ్‌! చుక్కేసి దొరికారో దబిడి దిబిడే

Hyderabad Traffic Restrictions: నూతన సంవత్సరం వేడకల్లో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం రాత్రి నుంచి భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేపట్టనున్నారు. ఎవరైనా పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు..

Hyderabad News: ఇవాళ రాత్రి నగరంలో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు.. ప్లైఓవర్లన్నీ క్లోజ్‌! చుక్కేసి దొరికారో దబిడి దిబిడే
Hyderabad Traffic
Srilakshmi C
|

Updated on: Dec 31, 2024 | 10:45 AM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31: మంగళవారం రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో అడిషనల్‌ ట్రాఫిక్‌ పోలీసు కమిషనర్‌ విశ్వప్రసాద్‌ పలు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఎన్టీఆర్‌ మార్గ్, నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌బండ్‌ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్‌ అనుమతి ఉండదని తెలిపారు. అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల వరకు హుస్సేన్‌సాగర్‌ చుట్టూ వాహనాల రాకపోకలపై అవసరాన్ని బట్టి ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే రోడ్డు భద్రత దృష్ట్యా ఔటర్ రింగ్ రోడ్ (ORR) డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు.

నాగోల్ ఫ్లైఓవర్, కామినేని ఫ్లైఓవర్, ఎల్‌బీ నగర్ ఎక్స్ రోడ్‌లోని మల్టీ లెవల్ ఫ్లైఓవర్‌లు, బైరామల్‌గూడ ఎక్స్‌రోడ్‌లోని మొదటి, రెండో లెవల్ ఫ్లైఓవర్‌లు, ఎల్‌బీ నగర్ అండర్‌పాస్, చింతలకుంట అండర్‌పాస్‌లను రాత్రి 10 గంటల నుంచి లైట్ మోటారు వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి ఉండదు. బేగంపేట్, టోలిచౌకీ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు ఇవాళ్టి రాత్రి నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు మూసివేస్తారు. విమాన టికెట్లు ఉండి, శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులను మాత్రమే పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ఫ్లైఓవర్‌పై అనుమతిస్తారు. నేటి రాత్రి 10 గంటల నుంచి ప్రైవేటు ట్రావెల్‌ బస్సులు, లారీలు, హెవీ గూడ్స్, ప్యాసింజర్‌ వాహనాలకు నగరంలోకి అనుమతి ఉండదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేటు బస్సులు ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

అలాగే బార్, పబ్, క్లబ్బులు తమ ప్రాంగణాల్లో కస్టమర్లను మద్యం సేవించి వాహనాలు నడపడానికి అనుమతిస్తే, చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని అన్ని రహదారుల్లో మద్యం తాగి వాహనాలు నడిపితే కస్టడీకి తీసుకుంటామని, ఈ మేరకు రోడ్లపై విస్తృత తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ట్యాంక్‌బండ్‌కు కాలినడకన వెళ్లాలనుకునే సందర్శకులు వాహనాలు సెక్రెటరియట్‌ విజిటర్స్‌ పార్కింగ్, ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ పక్కన హెచ్‌ఎండీఏ మైదానం, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం లేన్, రేస్‌ కోర్స్‌ రోడ్డు (ఎన్టీఆర్‌ ఘాట్‌ పక్కన), ఆదర్శనగర్‌ లేన్‌ (బైక్‌లు మాత్రమే) వద్ద పార్కింగ్‌ స్థలం కేటాయించినట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

క్యాబ్స్, ట్యాక్సీలు, ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించడంతోపాటు డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలి. లేదంటే వాహనాలు సీజ్‌ చేస్తారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు డ్రైవర్లు నిరాకరించడం, అదనపు ఛార్జీలు వసూలు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర పౌరులకు సూచించారు. రాత్రి 8 గంటల నుంచి కమిషనరేట్‌ పరిధిలోని అన్ని రహదారులు, కూడళ్లలో విస్తృతంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలుంటాయి. వాహనాల పైకి ఎక్కి అత్యుత్సాహం ప్రదర్శించే వారిపై కూడా కేసుల నమోద చేస్తామని అధికారులు హెచ్చరిచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.