Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత.. వందేళ్లు బతికిన తొలి ప్రెసిడెంట్‌గా రికార్డు!

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఆదివారం కన్నుమూశారు. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన తన నివాసంలో మృతి చెందినట్లు ఆయన కార్టర్ సెంటర్‌ ఫౌండేషన్ ఆదివారం వెల్లడించింది. అమెరికా 39వ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన జిమ్మీ కార్టర్ ఇటీవలు వంద ఏళ్లు పూర్తి చేసుకుని.. 101 పడిలో అడుగుపెట్టారు. ఇంతలో ఆయన

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత.. వందేళ్లు బతికిన తొలి ప్రెసిడెంట్‌గా రికార్డు!
Former US President Jimmy Carter
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 30, 2024 | 7:45 AM

వాషింగ్టన్, డిసెంబర్ 30: అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి గ్రహీత వందేళ్ల వయసులో జిమ్మీ కార్టర్ కన్నుమూశారు. 1977 నుంచి 1981 వరకు అమెరికా దేశ అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్‌ డిసెంబర్ 29 (ఆదివారం) మరణించిన విషయాన్ని ఆయన కార్టర్ సెంటర్‌ ఫౌండేషన్ ధృవీకరించింది. యునైటెడ్ స్టేట్స్‌కు 39వ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన జిమ్మీ కార్టర్ 1924 అక్టోబర్ 1న జన్మించారు. 2 నెలల క్రితమే 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. జిమ్మీ కార్టర్ అమెరికా చరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.

ఫిబ్రవరి 2023 నుంచి జార్జియాలోని ప్లెయిన్స్‌లోని ఆయన నివాసానికే పరిమితమయ్యారు. ఇక్కడే పుట్టి పెరిగిన కార్టర్‌ పీచ్ స్టేట్ గవర్నర్‌గా, వైట్ హౌస్‌కు పోటీ చేసే ముందు వేరుశనగ వ్యవసాయం చేశారు. 1946లో యూఎస్ నవల్ అకాడమీలో, ఆ తర్వాత యూఎస్ నేవీ సబ్‌మెరైన్ సర్వీస్‌లలో పని చేశారు. ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి వ్యవసాయం చేశారు. అమెరికాలో పెరిగిపోతున్న జాత్యాహంకారాన్ని రూపుమాపేందుకు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1976లో రిప్లబిక్ పార్టీ ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్‌పై గెలిచి అమెరికా 39వ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఇజ్రాయెల్ – ఈజిప్ట్ మధ్య ‘క్యాంప్ డేవిడ్ అకార్డ్స్’ అనే శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేయడంతో కార్టర్‌ పాత్ర ఎనలేనిది. ఆయన చేసిన సామాజిక, ఆర్థిక సేవలకుగానూ 2002 నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఆగస్టు 2015లో కార్టర్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారనైంది. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. కార్టర్ భార్య రోసలెన్ స్మిత్ 2023లో 96 ఏళ్ల వయసులో మృతి చెందారు. కార్టర్‌, స్మిత్ దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జిమ్మీ కార్టర్ కొడుకు జాక్ కార్టర్ యూఎస్‌లో ప్రఖ్యాత బిజినెస్‌మ్యాన్‌గా కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.