Watch: స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం…

సరిగ్గా ఇక్కడ కూడా అలాంటి సీనే ఎదురైంది. బాక్సింగ్‌ డే సందర్భంగా ఓ స్టోర్‌ ఓనర్‌.. తన షాపులో ఏ వస్తువు అయినా ఫ్రీగా తీసుకెళ్లొచ్చు అని ఆఫర్‌ పెట్టాడు. దీంతో జనం ఒక్కసారిగా స్టోర్‌లోకి ఎగబడి మొత్తం ఖాళీ చేశారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇదంతా ఎక్కడ ఏంటి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

Watch: స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
Store Owners Bumper Offer
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 29, 2024 | 10:03 PM

షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్ అంటేనే జనాలు ఎగబడతారు. అదే ఒకవేళ నచ్చిన వస్తువును ఫ్రీగా పట్టుకెళ్లండని ఎవరైనా ఆఫర్‌ ఇస్తే ఊరుకుంటారా? సరిగ్గా ఇక్కడ కూడా అలాంటి సీనే ఎదురైంది. బాక్సింగ్‌ డే సందర్భంగా ఓ స్టోర్‌ ఓనర్‌.. తన షాపులో ఏ వస్తువు అయినా ఫ్రీగా తీసుకెళ్లొచ్చు అని ఆఫర్‌ పెట్టాడు. దీంతో జనం ఒక్కసారిగా స్టోర్‌లోకి ఎగబడి మొత్తం ఖాళీ చేశారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇదంతా ఎక్కడ ఏంటి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో బాక్సింగ్ డే (డిసెంబర్ 26) నాడు ఇలాంటి గందరగోళం చెలరేగింది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని స్ట్రీట్‌ఎక్స్ స్టోర్‌లోకి వందలాది మంది ప్రజలు పోటెత్తారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో జనం మాల్‌లోకి పరిగెత్తడం చూపించే షాకింగ్ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది .

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by StreetX™ (@streetx)

స్ట్రీట్‌ఎక్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియో అప్‌లోడ్ చేయబడింది. అయితే, ఈ గందరగోళం కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం గానీ, తొక్కిసలాట వంటివి ఏవీ జరగలేదని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి