పెళ్లి కూతురు ఇంటిపై కురిసిన నోట్ల వర్షం.. జీవితకాలం అప్పులపాలైన వరుడు..! షాకింగ్ వీడియో..
పెళ్లికూతురు ఇంటిపై నుంచి విమానం ఎగురుతూ లక్షల రూపాయల నోట్లను వెదజల్లుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వధువు తండ్రి డిమాండ్‌తో వరుడి తండ్రి హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నారని, దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారని తెలిసింది.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అత్యంత కీలకమైనది. అలాంటి పెళ్లిని మరింత ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పెళ్లిలో ఏదైనా ప్రత్యేకంగా చేయాలని ప్రయత్నిస్తుంటారు. ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్ పేరుతో చాలా మంది వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ పెళ్లి సందర్భంగా హెలికాప్టర్ నుండి నోట్ల వర్షం కురిపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. పెళ్లికూతురు ఇంటిపై నుంచి విమానం ఎగురుతూ లక్షల రూపాయల నోట్లను వెదజల్లుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వధువు తండ్రి డిమాండ్‌తో వరుడి తండ్రి హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నారని, దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారని తెలిసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వరుడి తండ్రి తన కొడుకు పెళ్లి కోసం విమానం అద్దెకు తీసుకున్నాడని, వధువు ఇంటిపై లక్షల రూపాయల కరెన్సీ వర్షం కురిపించాడు. ఇప్పుడు వరుడు తన తండ్రి చేసిన రుణాన్ని జీవితాంతం కట్టాల్సిందేనని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు.
వీడియో ఇక్కడ చూడండి..
دلہن کے ابو کی فرماٸش۔۔۔😛 دولہے کے باپ نے بیٹے کی شادی پر کراٸے کا جہاز لےکر دلہن کے گھر کے اوپر سے کروڑوں روپے نچھاور کر دیٸے
اب لگتا ہے دُولھا ساری زندگی باپ کا قرضہ ہی اتارتا رہیگا pic.twitter.com/9PqKUNhv6F
— 𝔸𝕞𝕒𝕝𝕢𝕒 (@amalqa_) December 24, 2024
ఇది కేవలం డబ్బు వృధా అని, మరేమీ లేదని సోషల్ మీడియా వినియోగదారు రాశారు. పెళ్లికూతురి ఇంటిపై అధికారం చూపించేందుకు అప్పులు కూడా తీసుకుంటారని మరొకరు రాశారు. వధూవరులను పక్కన పెట్టండి, ఈ రోజు వారి ఇంటిపై నోట్ల వర్షం కురిసినందున దాని పొరుగువారు చాలా సంతోషంగా ఉంటారు అని ఒకరు రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి