AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numaish: నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..

నుమాయిష్‌కు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి కలిగి ఉండగా, ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు దీనిని సందర్శిస్తారు. పలు పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థల స్టాళ్లు, ఫుడ్‌ కోర్టులు, సందర్శకులను ఆకట్టుకునేందుకు అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ వంటి అనేక ప్రత్యేక ఆకర్షణలు అందుబాటులో ఉంటాయి. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 1వ తేదీన ఈ నుమాయిష్‌ ప్రారంభమై.. 46 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం వాయిదా పడింది.

Numaish: నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
Numaish
Jyothi Gadda
|

Updated on: Dec 29, 2024 | 6:45 PM

Share

హైదరాబాద్‌లోనే అతి పెద్ద ఎగ్జాబిషన్‌.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించే నుమాయిష్.. ఈ ఎగ్జిబిషన్‌ అంటే హైదరాబాద్‌ వాసులకు మాత్రమే కాదు.. జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ప్రజలకు నచ్చిన, అరుదైన వస్తువులు దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన కళాఖండాలు కూడా నుమాయిష్‌లో కొలువుదీరుతాయి. పలు పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థల స్టాళ్లు, ఫుడ్‌ కోర్టులు, సందర్శకులను ఆకట్టుకునేందుకు అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ వంటి అనేక ప్రత్యేక ఆకర్షణలు అందుబాటులో ఉంటాయి. అయితే, ప్రతి సంవత్సరం ఈ నుమాయిష్‌ జనవరి 1న ప్రారంభమై 46 రోజుల పాటు, అంటే ఫిబ్రవరి 15 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కానీ, ఈ యేడు నుమాయిష్‌ ప్రారంభం వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు ప్రారంభం కానుందంటే..

హైదరాబాద్‌లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరగాల్సిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) బుధవారం (జనవరి 1) ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఈ కార్యక్రమాన్ని రెండు ఆలస్యంగా అంటే, జనవరి 3న ప్రారంభించనున్నారు. మాజీ ప్రధాని సంతాప దినాల కారణంగా జనవరి 3కు వాయిదా వేసింది. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ జరుగనుంది. 84వ అల్ ఇండియా ఎగ్జిబిషన్ సొసైటీ, నుమాయిష్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ముఖ్య అతిథిగా పాల్గొని నుమాయిష్ ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించనున్నట్టు సమాచారం.

షెడ్యూల్ ప్రకారం, నుమాయిష్‌ జనవరి 1న ప్రారంభమై 46 రోజుల పాటు, అంటే ఫిబ్రవరి 15 వరకు జరగాల్సి ఉంది. పారిశ్రామిక ప్రదర్శన నిర్వహణలో ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షులు, మంత్రి శ్రీధర్‌ బాబు పర్యవేక్షణలో ఉపాధ్యక్షుడు నిరంజన్‌, కార్యదర్శి సురేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్‌, కోశాధికారి డాక్టర్‌ ప్రభాశంకర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 2500 స్టాళ్ల నిర్మాణానికి నిర్వాహకుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతో స్టాళ్ల కేటాయింపు చివరి దశకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..