AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. విషవాయువు పీల్చి నలుగురు మృతి..

ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. నాలుగో కూలీ ఉదయం 6 గంటలకు మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఈ ఘటనపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కంపెనీ నిర్లక్ష్యానికి కారణమని ప్రజలు ఆరోపిస్తూ, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. విషవాయువు పీల్చి నలుగురు మృతి..
Gujarat Gas Leak
Jyothi Gadda
|

Updated on: Dec 29, 2024 | 6:23 PM

Share

గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. దహేజ్‌లో ఓ రసాయన కర్మాగారంలో విష వాయువు లీకేజీ కారణంగా నలుగురు కార్మికులు మృతిచెందారు. దహేజ్ ప్రాంతంలోని గుజరాత్ ఫ్లూరో కెమికల్స్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ యూనిట్ లో ఈ ప్రమాదం జరిగింది. వాయువులు వెళ్లే ఒక పైప్‌లైన్‌కు రంధ్రం పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నిపుణులు గుర్తించారు. వాయువును పీల్చిన వెంటనే నలుగురు కార్మికులు స్పృహ కోల్పోయారు. వారిని గుర్తించిన ఇతర సిబ్బంది.. ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తర్వాత కొద్ది సేపటికే నలుగురు చనిపోయారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది..

ఈ మేరకు దహేజ్ పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ..కార్మికులను భరూచ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. నాలుగో కూలీ ఉదయం 6 గంటలకు మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించి గుజరాత్‌ ఫ్లోరోకెమికల్స్‌ లిమిటెడ్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఘటనపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కంపెనీ నిర్లక్ష్యానికి కారణమని ప్రజలు ఆరోపిస్తూ, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ. 150కోట్లు తగలేశారు.. పరమచెత్త సినిమా తీశారు..
రూ. 150కోట్లు తగలేశారు.. పరమచెత్త సినిమా తీశారు..
జనవరి 28, 29తేదీల్లో జరిగే JEE Main పరీక్షల అడ్మిట్ కార్డుల లింక్
జనవరి 28, 29తేదీల్లో జరిగే JEE Main పరీక్షల అడ్మిట్ కార్డుల లింక్
ఆకాశంలో అద్భుత దృశ్యం.. వైరల్ అవుతున్న డ్రోన్ షో
ఆకాశంలో అద్భుత దృశ్యం.. వైరల్ అవుతున్న డ్రోన్ షో
మేషరాశిలో శని.. ఈ రాశుల వారికి ఆకస్మిక లాభాలు, శుభవార్తలు వింటారు
మేషరాశిలో శని.. ఈ రాశుల వారికి ఆకస్మిక లాభాలు, శుభవార్తలు వింటారు
ద్రాక్ష పండ్లతో గుండె పోటుకు చెక్.. అది ఎలానో చూసెయ్యండి!
ద్రాక్ష పండ్లతో గుండె పోటుకు చెక్.. అది ఎలానో చూసెయ్యండి!
యూరిక్ యాసిడ్ తగ్గించే ఫ్రూట్స్ ఇవే.. తింటే ఆ నొప్పులన్నీ మాయం
యూరిక్ యాసిడ్ తగ్గించే ఫ్రూట్స్ ఇవే.. తింటే ఆ నొప్పులన్నీ మాయం
రైల్వే స్టేషన్‌లలో కేవలం రూ.100 లగ్జరీ రూమ్స్‌.. బుక్‌ చేయడం ఎలా?
రైల్వే స్టేషన్‌లలో కేవలం రూ.100 లగ్జరీ రూమ్స్‌.. బుక్‌ చేయడం ఎలా?
ఘనంగా విశాఖ ఉత్సవ్‌ ప్రారంభం.. హైలెట్ ఏమిటో తెలుసా ??
ఘనంగా విశాఖ ఉత్సవ్‌ ప్రారంభం.. హైలెట్ ఏమిటో తెలుసా ??
అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుడు.. ఒక్కసారిగా..
అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తుడు.. ఒక్కసారిగా..
ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..
ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..