త్వరగా ముసలితనం రాకూడదంటే.. సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. వీటిలోని పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. విటమిన్ సీ, ఈ వంటివి చర్మ కణాలను కాపాడి.. సమస్యల్ని దూరం చేస్తాయి. అలాగే, కూరగాయలు, తృణధాన్యాలు.. శరీరంలో వేడిని తగ్గించి.. త్వరగా ముసలితనం రాకుండా చేస్తాయి. పాలకూర, టమాటా, సాల్మన్ చేపలు, ఓట్స్, పప్పులు, గింజల వంటివి ఎక్కువగా తీసుకుంటే.. త్వరగా ముసలితనం రాదు. కూరగాయలు, మొలకలు, తృణధాన్యాలతో చేసే సూప్‌లు ఎక్కువగా తీసుకోవాలి.