AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moringa Leaves: ఈ ఆకు రోజూ పిడికెడు తింటే చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..! తెలిస్తే..

మునగాకులలో విటమిన్ సి, విటమిన్ ఎ కొల్లాజెన్ ఉత్పత్తి చేయడానికి సాయపడతాయి. ఈ కారణంగా చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ముఖంపై ముడతలు తగ్గి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇవి శరీర శక్తి స్థాయిలను పెంచి, అలసట, నీరసం నుంచి ఉపశమనం ఇస్తాయి. ఉదయం మునగాకులు తింటే రోజంతా చురుకుగా ఉండేలా చేస్తాయి.

Moringa Leaves: ఈ ఆకు రోజూ పిడికెడు తింటే చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..! తెలిస్తే..
Moringa Leaves
Jyothi Gadda
|

Updated on: Dec 29, 2024 | 7:17 PM

Share

మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఎన్నో ఔషధ గుణాలతో కూడిన మొక్కలు, చెట్లు అనేకం ఉన్నాయి. అయితే వాటి ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అలాంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో మునగ చెట్టు ఒకటి. మునగ కాయలతో పాటు మునగ ఆకులు కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ 300 రకాల రోగాలను నయం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

మునగాకులో ఫైబర్, ప్రొటిన్లు సమృద్ధిగా లభిస్తాయి. మునగాకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండె జబ్బులను నిరోధించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మునగాకులలో ఫైబర్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండటంతో జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే వీటిని పొడిలా తయారు చేసి, పచ్చడి, పప్పు లేదా సాంబార్, రసం వంటివి చేసుకుని తినవచ్చు. మునగాకులను తినడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గిపోతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఒక వరం లాంటి ఆహారంగా మారతాయి.

రోజువారీ ఆహారంలో మునగాకులు ఎంతో మేలు చేస్తాయి. మునగాకులను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. మునగాకులలో ఉండే సమ్మేళనాలు శరీరంలో వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. 100 గ్రాముల మునగాకుల్లో విటమిన్ సి – 18 మిల్లీగ్రాములు, విటమిన్ ఎ – 9100 IU, క్యాల్షియం – 130 మిల్లీగ్రాములు, ప్రోటీన్ 4 గ్రాములు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మునగాకులలో విటమిన్ సి, విటమిన్ ఎ కొల్లాజెన్ ఉత్పత్తి చేయడానికి సాయపడతాయి. ఈ కారణంగా చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ముఖంపై ముడతలు తగ్గి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇవి శరీర శక్తి స్థాయిలను పెంచి, అలసట, నీరసం నుంచి ఉపశమనం ఇస్తాయి. ఉదయం మునగాకులు తింటే రోజంతా చురుకుగా ఉండేలా చేస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!