AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బిజీ రోడ్డుపై కోడి గుడ్లు లారీకి యాక్సిడెంట్‌.. ఆ తర్వాత సీన్ ఇదే! వీడియో వైరల్

రోడ్డుపై కంటైనర్ లారీని కోడి గుడ్ల లారీ వెనుక నుండి ఢీ కొట్టింది. ప్రమాదంలో గుడ్లు లారీలో ఉన్న డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అటుగా వెళ్తున్న స్థానికులు ఈ ఘటన చూసి ఒక్కసారిగా పరుగులు తీశారు. డ్రైవర్ ని కాపాడేందుకని అనుకునేరు.. కానీ అసలు సంగతి ఇదీ!

Watch Video: బిజీ రోడ్డుపై కోడి గుడ్లు లారీకి యాక్సిడెంట్‌.. ఆ తర్వాత సీన్ ఇదే! వీడియో వైరల్
Eggs Truck Overturn On Road
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Mar 16, 2026 | 5:04 PM

Share

ఎచ్చెర్ల, మార్చి 16: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జరజాం సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై కోడి గుడ్ల లారీ ప్రమాదానికి గురయింది. శ్రీకాకుళం వస్తున్న క్రమంలో జాతీయ రాహదారిపై ముందు ఉన్న కంటైనర్ లారీని కోడి గుడ్ల లారీ వెనుక నుండి ఢీ కొట్టింది. ప్రమాదంలో కోడు గుడ్ల లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయి కాలుకు తీవ్రగాయాలు అయ్యాయి. అతనిని అంబులెన్స్‌లో చికిత్స కోసం శ్రీకాకుళం GGHకి తరలించారు. ఈ ప్రమాదం శనివారం (మార్చి 14) జరిగింది. ప్రమాదంలో లారీ క్యాబిన్ అంతా దెబ్బ తినడంతో లారీని రోడ్డు పక్కన అక్కడే విడిచిపెట్టారు. లారీలోని కోడి గుడ్ల సరుకుకు కాపలాగా క్లీనర్ అక్కడే ఉన్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం లారీలో కోడి గుడ్లు ఉన్నాయని అటుగా వెళ్లిన వాహనదారులు గమనించారు.

ఇక అంతే.. ఒక్కసారిగా జనాలు కోడి గుడ్లు కోసం ఎగబడ్డారు. లారీ వెనుక నుంచి ఎగబడి ట్రై లతో కోడి గుడ్లను అందినవారు అందినకాడకు దోచుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కొంత ట్రాఫిక్ కూడా జామ్ అయింది. క్లీనర్ తేరుకొని జనాలను నివారించే ప్రయత్నం చేసిన వెనక్కి తగ్గలేదు. ఈలోగా ఎచ్చెర్ల పోలీసులు ఘటన స్థలికి చేరుకొని జనాలను తరిమివేశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి కోడి గుడ్ల లారీకి రక్షణ కల్పించారు. కాగా గతంలోనూ ఇదే మాదిరి ఘటన చోటు చేసుకుంది. సరిగ్గా నెలన్నర కిందట కూడా ఇదే ప్రాంతంలో జాతీయ రహదారిపై కోడిగుడ్ల వ్యాన్ బోల్తా పడింది. తాజాగా శనివారం అదే ప్రాంతంలో ఇంకో కోడి గుడ్ల లారీ ప్రమాదానికి గురి కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

అమెరికా, ఇజ్రాయిల్.. ఇరాన్ యుద్ధం నేపద్యంలో ఇపుడు అంతటా సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇటు భారత్‌లోను ప్రజలు అప్రమత్తం అయ్యారు. ఎప్పుడూ ఏ వస్తువు ధర పెరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా నిత్యవసర సరుకులు, ఆహార దినుసులు, వంట గ్యాస్, వంట నూనె విషయంలో ముందుగానే స్టోర్ చేసుకుంటూ జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడ ఏం జరిగిన జనాలు ఎగబడుతున్నారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఈ చిన్న పదార్థం మీ బంగారు నగలకు పెద్ద శత్రువు! జస్ట్‌ టచ్‌చేస్తే
ఈ చిన్న పదార్థం మీ బంగారు నగలకు పెద్ద శత్రువు! జస్ట్‌ టచ్‌చేస్తే
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్
పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..
పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..