AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love: ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సార్లు ప్రేమలో పడతారో తెలుసా?.. తాజా సర్వేలో ఊహించని విషయాలు!

ప్రేమ.. ఇదో అద్భుతమైన అనభూమి. ఈ భూమి జన్మించిన ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా ప్రేమలో పడే తీరుతారు. అది చిన్నప్పుడైనా, పెద్దయ్యాక అయినా, లేదా ముసలివాళ్లయ్యాక అయినా సరే.. ఏదో ఒక సందర్భంలో జనాలు ప్రేమలో పడుతారు. అయితే తమ జీవితంలోకి ఎంతమంది వచ్చిన తొలిసారి ప్రేమను మాత్రం ఎవరూ మర్చిపోరు. అయితే ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్నిసార్లు ప్రేమలో పడతాడో మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి.

Love: ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సార్లు ప్రేమలో పడతారో తెలుసా?.. తాజా సర్వేలో ఊహించని విషయాలు!
True Love Frequency
Anand T
|

Updated on: Mar 16, 2026 | 2:37 PM

Share

ప్రేమ అనేది ఎప్పుడైనా, ఎవరిమీదనైనా కలగవచ్చు. కాబట్టి ఎవరు ఏ క్షణంలో ప్రేమలో పడతారో అనేది చెప్పడం కష్టం. ప్రేమ సరిగ్గా ఇప్పుడే పుడుతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. నిజమైన ప్రేమ ఒక్కసారే పుడుతుందని చాలా మంది చెబుతారు. ఇదే విషయంపై అధ్యయనం చేసిన అమెరికన్ కిన్సే ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఆశ్చర్యకరమైన ఫలితాలను కనుగొన్నారు. 18 నుండి 99 సంవత్సరాల వయస్సు గల 10,036 మందిపై అధ్యయనం జరిపిన ఈ పరిశోదకులకు ఊహించని ఫలితాలు కనిపించాయి.

సర్వేలో ఊహించని ఫలితాలు

ఈ సర్వే ఫలితాల ప్రకారం.. సగటున ఒక వ్యక్తి జీవితంలో కేవలం రెండుసార్లు మాత్రమే ప్రేమలో పడతారట. అందులో 14% మంది తాము ఎప్పుడూ ప్రేమలో పడలేదని చెప్పారట. మరో 28% మంది తాము ఒక్కసారే ప్రేమలో పడ్డామని, 30% మంది తాము రెండుసార్లు ప్రేమలో పడ్డామని చెప్పారట. మరో 17% మంది తాము 3 సార్లు ప్రేమలో పడ్డామని, మరో 11% మంది 4 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ప్రేమలో పడ్డామని చెప్పారని పరిశోదకులు చెబుతున్నారు.

ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సార్లు నిజమైన ప్రేమను ఫీల్ అవుతాడు

ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఎన్నిసార్లు నిజమైన ప్రేమను అనుభవిస్తాడో అని తెలుసుకునేందుకు చేపట్టిన సర్వే ఇది అని శాస్త్రవేత్త డాక్టర్ అమండా గెస్సెల్మాన్ తెలిపారు. మనం ప్రేమ గురించి చాలా సందర్భాల్లో చాలా మందితో మాట్లాడుతాం, కానీ నిజమైన, లోతైన ప్రేమ చాలా మందికి కొన్ని సార్లు మాత్రమే పుడుతుందని ఆమె అన్నారు. ప్రేమ భావన లింగం, వయస్సు లేదా వ్యక్తిగత ప్రాధాన్యతలను బట్టి పెద్దగా మారదని తెలిపారు. అంటే పురుషులు, స్త్రీలు లేదా విభిన్న లైంగిక ప్రాధాన్యతలు ఉన్న వ్యక్తులు అందరూ ప్రేమను దాదాపు ఒకే విధంగా ఫీల్ అవుతారని పరిశోధకులు అంటున్నారు.

నిజమైన ప్రేమ ఎక్కువ కాలం ఉండదు

నిజమైన ప్రేమ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. కాలక్రమేణా బాధ్యతలు పెరుగుతాయి, జీవితం మారుతుంది. అప్పుడు ప్రేమ తగ్గవచ్చు. కానీ దాని స్థానంలో, నమ్మకం, స్నేహం, పరస్పర గౌరవం ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమ పుడుతుందన్నారు. దీని వల్ల సంబంధాలు ఎక్కవుగా బలంగా, శాశ్వతంగా ఉంటాయని పరిశోదకులు చెబుతున్నారు. క్లియర్‌గా చెప్పాలంటే, నిజమైన ప్రేమ అనేది సాధారణంగా మన జీవితంలో రెండుసార్లు మాత్రమే పుడుతుందని పరిశోధకులు అంటున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us