AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreemukhi: బుల్లితెర రాములమ్మ క్రేజ్.. ఒక్కో షోకు శ్రీముఖి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? నెలకు అన్ని లక్షల ఆదాయమా?

ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్ ఎవరంటే సుమ కనకాల పేరు చెప్పవచ్చు. అయితే ఆ తర్వాతి స్థానం బుల్లితెర రాములమ్మ శ్రీముఖినే అని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. ప్రస్తుతం చేతి నిండా టీవీ షోస్, రియాలిటీ షోస్ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.

Sreemukhi: బుల్లితెర రాములమ్మ క్రేజ్.. ఒక్కో షోకు శ్రీముఖి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? నెలకు అన్ని లక్షల ఆదాయమా?
Sreemukhi
Basha Shek
|

Updated on: Apr 15, 2026 | 4:46 PM

Share

ఈటీవీ ప్రోగ్రాం పటాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. అంతకు ముందు జులాయి, నేను శైలజ వంటి సినిమాల్లో హీరో, హీరోయిన్లకు అక్కగా, చెల్లిగా నటించిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెర ప్రోగ్రామ్స్ తోనే బాగా పాపులర్ అయ్యింది. ఓ వైపు గ్లామర్ తో ఆకట్టుకుంటూనే మరోవైపు సందర్భానికి తగ్గట్టుగా గలగలా మాట్లాడడం, కామెడీ పంచులు వేయడం ఈ ముద్దుగుమ్మ స్పెషల్ ట్యాలెంట్. అందుకే బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలోనూ ఈ అందాల తార సత్తా చాటింది. రన్నరప్ గా నిలిచి తన క్రేజ్ ను అమాంతం పెంచుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టెలివిజన్ ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా, సినిమా ఆడియో ఫంక్షన్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, ప్రైవేట్ ఓపెనింగ్స్ తో బాగా బిజీ బిజీగా మారిపోయింది శ్రీముఖి. అదే సమయంలో క్రేజీ అంకుల్స్, మ్యాస్ట్రో, భోళాశంకర్ తదితర సినిమాల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార. మొత్తానికి ఇప్పుడు బుల్లితెరపైనా, అప్పుడప్పుడు వెండితెరపైనా మెరుస్తూ మస్త్ బిజీగా ఉంటోందీ అందాల తార. ఇదే క్రమంలో తన క్రేజ్, పాపులారిటీకి తగ్గట్టుగానే రెమ్యునరేషన్ ను తీసుకుంటోంది. ప్రస్తుతం ఒక్క షో, ఈవెంట్ కోసం శ్రీముఖి దాదాపు రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదా ఫంక్షన్ హోస్ట్ చేయాలంటే ఆమె కనీసం రూ. 1.5 లక్షల నుండి రూ. 2.5 లక్షల మధ్య పారితోషికం తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం ఈటీవీ, స్టార్ మా వంటి ఛానెళ్లలోని పలు ప్రోగ్రామ్స్ కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది శ్రీముఖి. అలాగే నెలకు కనీసం 3 నుంచి 4 సినిమా ఈవెంట్లను కూడా హోస్ట్ చేస్తోంది. ఈ లెక్కన శ్రీముఖి నెలవారీ ఆదాయం సుమారు రూ. 20 లక్షల నుండి రూ. 30 లక్షల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్ట్యా నిర్మాతలు కూడా ఆమె అడిగింది ఇచ్చేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు.

ఇవి కూడా చదవండి

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

కేవలం టీవీ ప్రోగ్రామ్స్, ఈవెంట్సే కాదు సోషల్ మీడియాలోనూ శ్రీముఖికి మస్త్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఉన్న మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ కారణంగా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, పెయిడ్ ప్రమోషన్ల ద్వారా ఆమె భారీగా ఆర్జిస్తున్నారు. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ పోస్ట్, వీడియో కోసం ఆమె లక్షల్లో ఛార్జ్ చేస్తారని సమాచారం. మొత్తానికి తన ట్యాలెంట్ తో శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై టాప్ ప్లేస్ లో ఉందని చెప్పవచ్చు.

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!