గాల్లో విహరిస్తూ.. మృత్యుఒడిలోకి! పారాచూట్లు చిక్కుపడి ప్రమాదం!
ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలనే ఉత్సాహం.. స్కై డైవింగ్ సాహస క్రీడలో భాగంగా వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకారు. పారాచూట్లు తెరుచుకోవడంతో సురక్షితంగా నేలపై దిగేందుకు సిద్ధమయ్యారు. అంతా సజావుగా సాగుతోందనుకున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. గాల్లోనే ఇద్దరు ఒకరినొకరు బలంగా ఢీకొన్నారు. దీంతో వారి పారాచూట్లు ఒకదానికొకటి చిక్కుకుపోయాయి. నియంత్రణ కోల్పోయిన ఇద్దరూ వేగంగా నేలపై పడిపోయారు.

ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలనే ఉత్సాహం.. స్కైడైవింగ్ సాహస క్రీడలో భాగంగా వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకారు. పారాచూట్లు తెరుచుకోవడంతో సురక్షితంగా నేలపై దిగేందుకు సిద్ధమయ్యారు. అంతా సజావుగా సాగుతోందనుకున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. గాల్లోనే ఇద్దరు ఒకరినొకరు బలంగా ఢీకొన్నారు. దీంతో వారి పారాచూట్లు ఒకదానికొకటి చిక్కుకుపోయాయి. నియంత్రణ కోల్పోయిన ఇద్దరూ వేగంగా నేలపై పడిపోయారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి చేరినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘోర ప్రమాదం స్కైడైవింగ్ ప్రపంచంలో విషాదాన్ని నింపింది.
అనుభవం ఉన్న స్కైడైవర్లే.. అయినా తప్పని ప్రమాదం!
ప్రమాదంలో మరణించిన వారిని జార్జియా జీన్ (56), లెవి పిమెంటెల్ (29)గా గుర్తించారు. వీరిద్దరూ లైసెన్స్ పొందిన అనుభవజ్ఞులైన స్కైడైవర్లు. జార్జియా జీన్‌కు స్కైడైవింగ్ అంటే ఎంతో ఆసక్తి. 2015లో ఈ సాహస క్రీడను ప్రారంభించిన ఆమె.. ఇప్పటివరకు 1,700కు పైగా జంప్‌లు చేశారు. సర్కిల్ ఎవల్యూషన్ అనే సంస్థను కూడా ఆమె స్థాపించారు. 29 ఏళ్ల లెవి పిమెంటెల్ ఇండోర్ స్కైడైవింగ్ సంస్థ ఐఫ్లై (iFLY)లో లీడ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె స్కైడైవింగ్‌లో శిక్షణ ఇచ్చే స్థాయిలో అనుభవం ఉన్న వ్యక్తిగా రివర్‌సైడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది
150 అడుగుల ఎత్తులో ఏం జరిగింది?
కాలిఫోర్నియాలోని స్కైడైవ్ ఎల్సినోర్‌లో స్కైడైవింగ్ కార్యక్రమంలో జార్జియా, లెవి పాల్గొన్నారు. మొదట విమానం నుంచి కిందకు దూకినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. పారాచూట్లు తెరుచుకున్న తర్వాత కూడా అంతా సాధారణంగానే సాగింది. కానీ నేలకు చేరుకునే ముందు 150 అడుగుల ఎత్తులో ఇద్దరూ ఒకరినొకరు ఢీకొన్నారు. వారి పారాచూట్లు ఒకదానికొకటి చిక్కుకున్నాయి. దీంతో పారాచూట్లపై నియంత్రణ కోల్పోయి ఇద్దరూ నేలపై పడిపోయారు. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలతో ఉన్న ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై స్కైడైవ్ ఎల్సినోర్ సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
పారాచూట్లను పరిశీలించనున్న అధికారులు
ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. ఇద్దరు స్కైడైవర్ల పారాచూట్లను సేకరించి పరిశీలించనున్నారు. స్కైడైవింగ్‌లో ఎన్నోసార్లు పాల్గొన్న అనుభవం.. ఇతరులకు శిక్షణ ఇచ్చే స్థాయి నైపుణ్యం ఉన్నప్పటికీ ఈ ప్రమాదం నుంచి ఇద్దరూ తప్పించుకోలేకపోయారు. ఆకాశంలో ఆనందంగా సాగాల్సిన వారి సాహస ప్రయాణం విషాదాంతంగా ముగిసింది.