AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వరదల్లో చిక్కుకున్న చింపాంజీలకు ఆకాశం నుంచి ఫుడ్ డెలివరీ!

వరదలు వస్తే మనుషులకే కాదు.. మూగజీవాలకూ కష్టాలు తప్పవు. చుట్టూ నీరు చేరే పరిస్థితి వస్తే వాటి ఆకలి తీర్చడం సవాలుగా మారుతుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో భారీ వర్షాలతో ఓ జంతు సంరక్షణ కేంద్రం మొత్తం వరద నీటిలో చిక్కుకుపోయింది. చింపాంజీలకు ఆహారం అందించేందుకు సిబ్బంది డ్రోన్‌ని రంగంలోకి దించారు. దాని సాయంతో అరటిపండ్లు, దుప్పట్లను చింపాంజీల దగ్గరకు చేర్చారు. వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Video: వరదల్లో చిక్కుకున్న చింపాంజీలకు ఆకాశం నుంచి ఫుడ్ డెలివరీ!
Drone Used To Delivers Food To Chimpanzees Stuck In Flooded Florida Sanctuary
Sharada V
|

Updated on: Nov 08, 2026 | 8:27 AM

Share

ఫ్లోరిడా ఫోర్ట్ పియర్స్‌లోని ‘సేవ్ ది చింప్స్’ (Save The Chimps) జంతు సంరక్షణ కేంద్రం భారీ వర్షాల కారణంగా నీటమునిగి చింపాంజీల దగ్గరకు వెళ్లడం సిబ్బందికి అసాధ్యంగా మారింది. సాధారణంగా ఉపయోగించే గోల్ఫ్ కార్టులు, ఇతర వాహనాలు వరద నీటిలో ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది.

150 ఎకరాల్లో విస్తరించిన ఈ కేంద్రంలో ఒకవైపు వరద నీరు మరోవైపు ఆకలితో ఉన్న మూగజీవాలు! దీంతో సిబ్బంది వినూత్న పరిష్కారాన్ని ఆలోచించారు. వరదలు తగ్గే వరకు ఎదురుచూడకుండా ఆహారం, ఇతర అవసరమైన వస్తువులను పేపర్ బ్యాగుల్లో ఉంచి డ్రోన్‌కు అమర్చి చింపాంజీలు ఉన్న ప్రాంతాలకు పంపించారు.

డ్రోన్ నుంచి అరటిపండు బ్యాగ్.. ఆనందంగా తిన్న కాలేబ్!

ఈ వీడియోలో కాలేబ్ అనే చింపాంజీకి డ్రోన్ ద్వారా అరటిపండ్లు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్రోన్ గాల్లో నుంచి జాగ్రత్తగా ఓ పేపర్ బ్యాగును కిందకు వదిలింది. అందులో ఉన్న అరటిపండును తీసుకున్న కాలేబ్ ఎంతో ఇష్టంగా తింటూ కనిపించింది. మరోవైపు డ్రోన్ ద్వారా పంపించిన దుప్పటిపై ఓ చింపాంజీ హాయిగా విశ్రాంతి తీసుకుంటుండగా దాని పక్కనే ఉన్న మరో చింపాంజీ చెవిలోని చిన్న పురుగులను తొలగిస్తూ కనిపించింది. ఈ దృశ్యాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

చింపాంజీలకు తప్పిన ప్రమాదం .. భారీగా ఆస్తి నష్టం!

ఈ వీడియోను సేవ్ ది చింప్స్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ సంరక్షణలో ఉన్న చింపాంజీలన్నీ క్షేమంగా ఉన్నాయని వెల్లడించింది. అయితే వరదల కారణంగా కేంద్రానికి భారీ నష్టం వాటిల్లిందని, రోడ్లు దెబ్బతిన్నాయనీ తెలిపింది. గోల్ఫ్ కార్టులు, ఫోర్ వీల్ డ్రైవ్ వాహనం, ఆహారాన్ని నిల్వ చేసే వాక్-ఇన్ కూలర్‌కు సంబంధించిన కంప్రెసర్‌తో పాటు ఇతర పరికరాలు దెబ్బతిన్నాయని తెలిపింది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు తమకు ప్రజల సహాయం అవసరమని విజ్ఞప్తి చేసింది.

ఎత్తైన ప్రాంతాల్లో చింపాంజీలు సేఫ్!

ఈ ఘటనపై సంస్థ సీఈఓ అనా పౌలా టవారెస్ మాట్లాడుతూ,  చింపాంజీలు నివసించే ద్వీపాల్లో వాటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఎన్ క్లోజర్ ఎత్తైన ప్రాంతాల్లో ఉండటంతో అవి సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. అయితే నీరు నిలిచిపోవడంతో సిబ్బంది విధులకు హాజరుకావడం, జంతువులకు అవసరమైన సేవలు అందించడం సవాలుగా మారిందని అన్నారు.

వరద నీరు పూర్తిగా తగ్గిన తర్వాత కేంద్రానికి జరిగిన నష్టం ఎంత? తిరిగి యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎలాంటి మరమ్మతులు అవసరం అన్న విషయాలపై అంచనా వేస్తామని చెప్పారు. మొత్తానికి ఆపదలో ఉన్న చింపాంజీలకు డ్రోన్ సాయంతో ఆహారం, దుప్పట్లు అందించిన సిబ్బంది చొరవ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. టెక్నాలజీని ఉపయోగించి మూగజీవాల ఆకలి తీర్చిన ఈ ప్రయత్నం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ చూడండి

Follow Us
ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. హార్దిక్ ట్రేడ్ ఫిక్స్?
ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ.. హార్దిక్ ట్రేడ్ ఫిక్స్?
మరికొద్దిసేపట్లో ఆసియా కప్‌లో హై ఓల్టేజీ మ్యాచ్‌..!
మరికొద్దిసేపట్లో ఆసియా కప్‌లో హై ఓల్టేజీ మ్యాచ్‌..!
పరిషత్‌ పోరులో కూటమి క్లీన్‌స్వీప్‌.. 27 జడ్పీ పీఠాలు కైవసం..!
పరిషత్‌ పోరులో కూటమి క్లీన్‌స్వీప్‌.. 27 జడ్పీ పీఠాలు కైవసం..!
Video: వరదల్లో చిక్కుకున్న చింపాంజీలకు ఆకాశం నుంచి ఫుడ్ డెలివరీ!
Video: వరదల్లో చిక్కుకున్న చింపాంజీలకు ఆకాశం నుంచి ఫుడ్ డెలివరీ!
ఇంటర్‌ పరీక్షల టైమ్‌టేబుల్‌లో కీలక మార్పులు.. విద్యార్థులకు ఊరట!
ఇంటర్‌ పరీక్షల టైమ్‌టేబుల్‌లో కీలక మార్పులు.. విద్యార్థులకు ఊరట!
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే లెర్నర్‌ లైసెన్స్‌ పరీక్ష
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే లెర్నర్‌ లైసెన్స్‌ పరీక్ష
నమన్ ధీర్ ఔట్‌పై వివాదం.. అసలేం జరిగిందంటే..?
నమన్ ధీర్ ఔట్‌పై వివాదం.. అసలేం జరిగిందంటే..?
నేతల పలుకుబడికి పరీక్ష పెట్టిన ఓటర్లు!
నేతల పలుకుబడికి పరీక్ష పెట్టిన ఓటర్లు!
IRCTC టికెట్ బుకింగ్.. రైల్వే డైనమిక్ ప్రైసింగ్ అంటే ఏమిటి?
IRCTC టికెట్ బుకింగ్.. రైల్వే డైనమిక్ ప్రైసింగ్ అంటే ఏమిటి?
'NEET దరఖాస్తులో తప్పు చేశారా? కోర్టులో సానుభూతి కోరొద్దు'.. HC
'NEET దరఖాస్తులో తప్పు చేశారా? కోర్టులో సానుభూతి కోరొద్దు'.. HC