AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayaprada : ఆయనతో సినిమా కోసం నా కెరీర్‏నే వదిలేశా.. ఆయన లేకపోతే నేను లేను.. హీరోయిన్ జయప్రద..

ఒకప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అందం, అభినయంతో చక్రం తిప్పిన హీరోయిన్లలో జయప్రద ఒకరు. అలనాటి ఈ అందాల తార అప్పట్లో స్టార్ హీరోస్ అందరి సరసన నటించి తనదైన ముద్ర వేసింది. కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె ఆ తర్వాతి కాలంలో కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సహయ నటిగానూ మెప్పించారు. తాజాగా తన సినీ ప్రయాణంలో ఓ మూవీ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.

Jayaprada : ఆయనతో సినిమా కోసం నా కెరీర్‏నే వదిలేశా.. ఆయన లేకపోతే నేను లేను.. హీరోయిన్ జయప్రద..
Jayaprada
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2026 | 10:09 AM

Share

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం సినిమాలు కావు, అవి ఒక అనుభూతి, ఒక కళాఖండం. అలాంటి అద్భుతమైన చిత్రాల్లో దర్శకేంద్రుడు కె. విశ్వనాథ్ సృష్టించిన సాగర సంగమం ఒకటి. ఈ చిత్రం ఎందరో కళాకారుల జీవితాలను ప్రభావితం చేసింది. ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో, ప్రముఖ నటి జయప్రద సాగర సంగమం చిత్రంతో తనకున్న అనుబంధాన్ని, దాని కోసం తానెంతటి త్యాగానికైనా సిద్ధపడ్డాననే విషయాన్ని వెల్లడించారు. ఆ సమయంలో జయప్రద కమర్షియల్ చిత్రాలతో బిజీగా ఉన్నారని, బాలీవుడ్‌లో కూడా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని ఆమె గుర్తుచేసుకున్నారు. అలాంటి కీలక సమయంలో సాగర సంగమంలో ఒక వృద్ధురాలి పాత్రను పోషించాల్సి రావడంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారట. “అరే జయప్రద గారు, మీరు ఓల్డ్ రోల్ ఎలా చేస్తారండి? మీ కెరీర్ ఎఫెక్ట్ అయిపోతుందండి” అంటూ స్నేహితులు, సన్నిహితులు హెచ్చరించారని ఆమె వివరించారు. అయితే, ఆ పాత్ర ప్రాధాన్యతను, కె. విశ్వనాథ్ విజన్‌ను అర్థం చేసుకున్న జయప్రద, తన కెరీర్ పోయినా, ఆ తర్వాత పిక్చర్లు చేయకపోయినా, రిటైర్ అయిపోయినా పర్వాలేదని, సాగర సంగమంలో తప్పకుండా నటిస్తానని దృఢంగా నిర్ణయించుకున్నారట.

దర్శకుడు కె. విశ్వనాథ్‌ను తన కెరీర్‌కు బ్రహ్మగా తెలిపారు జయప్రద. సాధారణంగా దర్శకులను దర్శకే బ్రహ్మా అని పిలవడం ఆనవాయితీ అని, కానీ తన జీవితంలో, తమ వంటి నటుల జీవితాల్లో కె. విశ్వనాథ్ నిజంగానే బ్రహ్మ అని ఆమె పేర్కొన్నారు. “ఆయన లేకుంటే ఇవ్వాళ నేను గాని, కమలహాసన్ గాని, చంద్రమోహన్ గారు గాని ఎవరూ ఉండరు” అని ఆమె స్పష్టం చేశారు. ఆయా పాత్రలను సృష్టించడం ఒక ఎత్తైతే, వాటిని తెరపై పలికించడం మరో పెద్ద సవాలని జయప్రద అన్నారు.

కె. విశ్వనాథ్ దర్శకత్వ ధైర్యానికి ఒక ఉదాహరణగా కమల్ హాసన్ పాత్ర పరిచయాన్ని జయప్రద వివరించారు. అప్పటికే స్టార్ హీరో అయిన కమల్ హాసన్‌ను జుట్టుకు తెల్లరంగు వేసి, ఒక జోల ధరించి, చిరిగిన చెప్పుతో రిక్షా తోసే వృద్ధుడిగా పరిచయం చేయడం విశ్వనాథ్ గారికి మాత్రమే సాధ్యమైందని ఆమె అన్నారు. చెప్పులో కాలిపోయిన సిగరెట్ వల్ల పడిన కన్నం, దాని ద్వారా కనిపించే చెప్పు భాగం వంటి సూక్ష్మ వివరాలు విశ్వనాథ్ విజన్‌కు అద్దం పడతాయని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుత కాలంలో హీరోలు, హీరోయిన్లు బ్యాంకాక్, స్విట్జర్లాండ్ వంటి విదేశీ లొకేషన్లు, డాన్సులు, ఖరీదైన దుస్తులు కోరుకుంటున్నారని, అయితే సాగర సంగమంలో అలాంటి వాటికి తావు లేదని జయప్రద అన్నారు. ఒకే ఒక పైజామా, కుర్తా, జోల ధరించి కమల్ హాసన్ నటించగా, తన పాత్ర కూడా ఎలాంటి ఫ్యాన్సీ డ్రెస్సులు లేకుండా మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళగా కనిపించిందని ఆమె వివరించారు.

Follow Us