AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రేమ అంటే ఇదీ.. విగతజీవిగా మారిన ఫ్రెండ్ కోసం తల్లడిల్లిన కోతులు.. వీడియో చూస్తే..

ఒక మనిషి ఆపదలో ఉంటే కనీసం పలకరించకుండా వెళ్లిపోయే నేటి సమాజంలో.. ఒక మూగజీవి చనిపోతే వందలాది వానరాలు స్పందించిన తీరు ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరిగేలా చేసింది. కరెంట్ షాక్‌తో విగతజీవిగా మారిన తోటి కోతి మృతదేహాన్ని ముట్టుకోనివ్వకుండా వానర సైన్యం చేసిన పోరాటం చూపరులను నివ్వెరపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana: ప్రేమ అంటే ఇదీ.. విగతజీవిగా మారిన ఫ్రెండ్ కోసం తల్లడిల్లిన కోతులు.. వీడియో చూస్తే..
Monkey Troop Guards Electrocuted Friend
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Nov 08, 2026 | 10:03 AM

Share

తోటి జీవి ఆపదలో ఉంటే మనుషులే పట్టించుకోని ఈ రోజుల్లో, ఒక మూగజీవి మృతికి వందలాది వానరాలు స్పందించిన తీరు స్థానికుల హృదయాలను బరువెక్కించింది. విద్యుత్ షాక్‌తో విగతజీవిగా మారిన తోటి కోతి కళేబరాన్ని కనీసం ముట్టుకునేందుకు కూడా మానవులను అనుమతించకుండా వానర సైన్యం చేసిన ప్రయత్నం చూపరులను కంటతడి పెట్టించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కాటారం మండలం గారేపల్లి గ్రామ పరిధిలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఈ హృదయ విదారక దృశ్యం కనిపించింది.ఆదివారం ఉదయం ఓ కోతి ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభంపైకి ఎక్కింది. అక్కడ ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆ వానరం మృతదేహం తీగలపైనే వేలాడుతూ ఉండిపోయింది.

విద్యుత్ సిబ్బందిని పరుగులు పెట్టించిన వానర సేన

తీగలపై చిక్కుకున్న కోతి కళేబరాన్ని కిందకు దించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే వారు స్తంభం వద్దకు వెళ్లడాన్ని గమనించిన పరిసరాల్లోని కోతుల గుంపు ఒక్కసారిగా సంఘటితమైంది. తోటి జీవి మృతదేహాన్ని ముట్టుకోవద్దంటూ విద్యుత్ సిబ్బంది చుట్టూ మూగాయి. పెద్ద ఎత్తున కేకలు వేస్తూ, పళ్లు కొరుకుతూ సిబ్బందిపైకి దాడికి యత్నించడంతో అధికారులు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చింది.

రెండు గంటల పాటు భావోద్వేగ పోరాటం

చనిపోయిన కోతి డెడ్‌బాడీని ఎలాగైనా తమతో తీసుకెళ్లాలని వానర సైన్యం తీవ్రంగా ఆరాటపడింది. తీగలపై నుంచి మృతదేహాన్ని కిందకు దించే క్రమంలో అవి పడిన తపన చూపరులను విస్మయానికి గురిచేసింది. దాదాపు రెండు గంటల పాటు మృతదేహం ఉన్న ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుని, మనుషులను దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా పహారా కాశాయి. వానరాల మధ్య కనిపించిన ఈ అపురూపమైన ప్రేమ, ఐక్యతను చూసి గ్రామస్తులు ఆశ్చర్యంతో నివ్వెరపోయారు.

ఈ సంఘటనతో గారేపల్లి అంబేడ్కర్ చౌరస్తాలో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించగా, చివరకు కోతుల అలజడి కాస్త సద్దుమణిగిన అనంతరం విద్యుత్ అధికారులు జాగ్రత్తగా మృతదేహాన్ని కిందకు దించి సరఫరాను పునరుద్ధరించారు. తోబుట్టువుల అనుబంధాన్ని తలపించేలా మూగజీవులు ప్రదర్శించిన ఈ ఆవేదన ప్రతి ఒక్కరి మనసును కదిలించింది.

వీడియో చూడండి..

Follow Us