AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి చేసుకోవాలని కోరిందనీ.. ఇనుపరాడ్డుతో ప్రియురాలి తల బద్దలు కొట్టిన ప్రియుడు!

కర్ణాటకలోని మంగళూరు సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్లుగా పరిచయంలో ఉన్న యువతి పెళ్లి చేసుకోవాలని కోరుతుండటంతో ప్రసాద్ అనే యువకుడు ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బిసిలె ఘాట్‌కు కారులో తీసుకెళ్లి ఇనుపరాడ్డుతో తలపై దాడి చేసి, ఆమె చనిపోయిందని భావించి అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అయితే తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు..

పెళ్లి చేసుకోవాలని కోరిందనీ.. ఇనుపరాడ్డుతో ప్రియురాలి తల బద్దలు కొట్టిన ప్రియుడు!
Man Leaves Woman For Dead After Brutal Iron Rod Attack
Srilakshmi C
|

Updated on: Nov 08, 2026 | 11:01 AM

Share

మంగళూరు, నవంబర్ 8: ప్రేమించిన యువతి మూడేళ్లుగా పెళ్లి చేసుకోవాలని కోరుతుండటంతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను హత్య చేయాలనే ఉద్దేశంతో ఇనుపరాడ్డుతో తలపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న యువతి.. ఎలాగోలా ప్రాణాలతో బయటపడి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి ప్రసాద్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా కోణాజె గ్రామానికి చెందిన ప్రసాద్‌కు ఓ యువతితో గత మూడేళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ స్నేహితులుగా ఉంటున్నారు. ఈ క్రమంలో యువతి తనను వివాహం చేసుకోవాలని ప్రసాద్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 4వ తేదీ సాయంత్రం ప్రసాద్ కారులో ఉప్పినంగడి వద్దకు వెళ్లి యువతిని ఎక్కించుకున్నాడు. అనంతరం కుల్కుంద మీదుగా బిసిలె ఘాట్‌కు బయలుదేరాడు. ప్రయాణం మధ్యలో ఇనుపరాడ్డుతో యువతిపై దాడి చేశాడు. తలపై తీవ్ర గాయాలు కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. యువతి మరణించిందని భావించిన నిందితుడు ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు నవంబర్ 5వ తేదీ ఉదయం ఆమెకు స్పృహ వచ్చింది. తీవ్ర గాయాలతోనే సుబ్రహ్మణ్య ప్రాంతానికి చేరుకున్న బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సుబ్రహ్మణ్య పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్లు 118(1), 109(1) కింద కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతం హాసన్ జిల్లాలోని యెస్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి కోణాజె గ్రామానికి చెందిన ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల కోసం యెస్లూరు పోలీసులకు అప్పగించారు. ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుని, వివాహం చేసుకోవాలని కోరిన యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడి తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us