AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: బస్తర్‌కు పయనమైన ప్రధాని.. జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు..

ప్రతి ఏటా సైనికుల సమక్షంలో దీపావళి జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు పయనమయ్యారు. ఒకప్పుడు నక్సలిజం కోరల్లో నలిగి, నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆ ప్రాంతంలో భద్రతా బలగాలకు సెల్యూట్ చేసేందుకు బయలుదేరినట్లు ప్రధాని వెల్లడించారు. దేశ ప్రజలందరికీ దీపాల పండుగ శుభాకాంక్షలు చెబుతూ మోదీ పెట్టిన భావోద్వేగ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

PM Modi: బస్తర్‌కు పయనమైన ప్రధాని.. జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు..
Pm Modi Leaves For Bastar To Celebrate Diwali With Jawans
Krishna S
|

Updated on: Nov 08, 2026 | 11:06 AM

Share

దేశ సరిహద్దులు, సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వీర జవాన్ల సమక్షంలో దీపావళి జరుపుకునే ఆనవాయితీని కొనసాగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు బయలుదేరారు. ఒకప్పుడు నక్సలిజం కోరల్లో చిక్కుకుని, నేడు శాంతి, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న బస్తర్ గడ్డపై భద్రతా బలగాలతో కలిసి ఆయన ఈ ఏడాది దీపావళి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

నిస్వార్థ సేవకు సెల్యూట్ చేస్తానన్న ప్రధాని

బస్తర్‌కు బయలుదేరిన విషయాన్ని తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. ‘‘మన ధైర్యవంతులైన భద్రతా బలగాలతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవడానికి బస్తర్ బయలుదేరాను. ఒకప్పుడు నక్సలిజం కోరల్లో నలిగిపోయిన ఈ ప్రాంతంలో.. ఇప్పుడు అభివృద్ధి వెల్లివిరుస్తోంది. దేశం కోసం సర్వస్వం త్యాగం చేస్తూ, నిస్వార్థంగా సేవలందిస్తూ, అచంచలమైన దేశభక్తిని ప్రదర్శిస్తున్న మన వీర జవాన్లకు వందనం సమర్పించేందుకే నేను అక్కడికి వెళ్తున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు.

సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న మోదీ

2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి ఏటా దీపావళి పండుగను దేశ రక్షణలో ఉండే సైనికులతో కలిసి జరుపుకోవడం ప్రధాని మోదీకి అలవాటుగా వస్తోంది. గతంలో సియాచిన్, లడఖ్, కార్గిల్, రాజస్థాన్ సరిహద్దుల్లో జవాన్లతో వేడుకలు జరుపుకున్న ఆయన, ఈసారి మావోయిస్టుల ప్రాబల్యం తగ్గి శాంతి బాట పట్టిన బస్తర్ ప్రాంతాన్ని ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బస్తర్ చేరుకున్న వెంటనే ఆయన భద్రతా బలగాలను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు, జవాన్లతో ముచ్చటించి వారికి స్వీట్లు పంపిణీ చేయనున్నారు.

దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న జవాన్ల త్యాగాల వల్లే దేశప్రజలంతా ఇళ్లలో సురక్షితంగా దీపాలు వెలిగించుకోగలుగుతున్నారని ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

Follow Us