ప్రాణంగా ప్రేమించినోడే మోసం చేశాడు.. ఆ బాధను తట్టుకోలేపోయా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

07 November 2026

టాలీవుడ్ , కోలీవుడ్‌లో అందం, అభినయంతోపాటు.. అటు గ్లామర్ పాత్రలతో పాటు విభిన్నమైన నటనతో ఆకట్టుకుంటున్న హీరోయిన్ రెజీనా కసాండ్రా

తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై స్పందించారు. గతంలో తాను ఎదుర్కొన్న ప్రేమ వైఫల్యం గురించి చెప్పుకొచ్చింది ఈ భామ. 

అలాగే ఆ బంధంలో జరిగిన ద్రోహం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. 2020లో తన ప్రేమ బంధం ముగిసిపోయిందని ఆమె వెల్లడించారు.

తాను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తే తనను మోసం చేశాడని, ఆ నమ్మద్రోహం తనను మానసికంగా తీవ్రంగా కుంగదీసిందని రెజీనా చెప్పుకొచ్చారు. 

ఆ సమయంలో ఎదురైన మానసిక వేదనను మాటల్లో వర్ణించలేనని, ఆ బాధ నుంచి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని ఆమె పేర్కొన్నారు.

అయితే ఆ కష్టకాలం నుంచి బయటపడటంతోపాటు తన గురించి తాను తెలుసుకోవడానికి కరోనా లాక్‌డౌన్ తనకు ఒక వరంగా మారిందని రెజీనా చెప్పారు.

బ్రేకప్ తర్వాత కొంతకాలం పాటు ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని, తన గురించి తాను ఆలోచించుకున్నానని అన్నారు.

తనను తాను ప్రేమించుకోవడానికి ఆ సమయం ఉపయోగపడిందని తెలిపారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు వెల్లడించింది.