AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ సర్కార్‌ అదిరిపోయే గిఫ్ట్‌.. వారి అకౌంట్లో రూ.20 వేలు..!

Andhra Pradesh: ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి బ్యాంకు అకౌంట్లో 20 వేల రూపాయలు వేస్తామని తెలిపారు. అయితే ప్రస్తుతం తీర ప్రాంత గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరుగుతోంది. వారి కుటుంబాలను ఆదుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం చెబుతోంది..

Andhra Pradesh: ఏపీ సర్కార్‌ అదిరిపోయే గిఫ్ట్‌.. వారి అకౌంట్లో రూ.20 వేలు..!
Andhra Pradesh
Subhash Goud
|

Updated on: Apr 15, 2026 | 4:45 PM

Share

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు అదిరిపోయే శుభవార్త అందించింది. సముద్రంలో చేపల వేట నిషేధ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు రూ. 20,000 ఆర్థిక సాయాన్ని అందించేందుకు సర్కార్ సిద్ధమైంది.

నేటి నుంచే వేటపై నిషేధం:

సముద్ర సంపద రక్షణ, చేపల పునరుత్పత్తి కోసం ప్రతి ఏటా వేసవిలో చేపల వేటపై నిషేధం విధిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 (నేటి) నుండి జూన్ 14 వరకు (మొత్తం 61 రోజులు) ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.

ఇది కూడా చదవండి: AC Offer: ఏసీ కొనాలని ఉందా? కేవలం రూ.1 కే కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లండి.. రిలయన్స్ అదిరిపోయే ఆఫర్లు!

ఇవి కూడా చదవండి

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ:

ప్రస్తుతం తీర ప్రాంత గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరుగుతోంది. మత్స్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. పారదర్శకత కోసం ఎంపికైన వారి జాబితాను స్థానిక సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. తుది జాబితా ఖరారు కాగానే నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది.

ఎవరు అర్హులు?

వయస్సు: 18 నుండి 60 ఏళ్ల మధ్య ఉండాలి. మత్స్యశాఖలో నమోదైన యాంత్రీకరణ, మోటరైజ్డ్ లేదా సంప్రదాయ పడవల్లో పనిచేసే కార్మికులు, యజమానులు అందరూ అర్హులు. అలాగే గత ఏడాది సుమారు 1.30 లక్షల కుటుంబాలకు ఈ సాయం అందింది.

ఇది కూడా చదవండి: Gold Limit Rules: బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను ఏంటి?

కావలసిన పత్రాలు:

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు ఈ కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

  • మత్స్యకార గుర్తింపు కార్డు.
  • ఆధార్ కార్డు.
  • బ్యాంక్ పాస్ బుక్.
  • బోటు రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ పత్రాలు.

కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మత్స్యకార కుటుంబాలకు ఈ వేసవిలో పెద్ద ఊరట లభించనుంది.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌..3 నెలల వరకు రైల్వే టికెట్లపై తగ్గింపు!

ఇది కూడా చదవండి: ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు ఇవే..!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..