AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పాపం ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

ఏ తల్లి అయినా పిల్లల క్షేమాన్నే కోరుకుంటుంది. పిల్లల కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటేనే ఆమె మనసు తల్లడిల్లుపోతుంది. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తూ బిడ్డల్ని బాగా చూసుకుంటుంది. కానీ ఇక్కడ అలాంటి ఓ తల్లే తన కన్నబిడ్డల పాలిట మృత్యువుగా మారింది. ఏం జరిగిందో ఏమో కానీ.. తన పేగుతెంచుకొని జన్మనిచ్చిన ఇద్దరు పిల్లలను హత్య చేసేందుకు ప్రయత్నించి.. చివరకు ఆమెకు కూడా ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Telangana: పాపం ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి
Telangana Crinme News
Naresh Gollana
| Edited By: |

Updated on: Mar 16, 2026 | 4:49 PM

Share

ఇద్దరు పిల్లను చంపేందుకు ప్రయత్నించి.. వారు చనిపోయారనుకొని తర్వాత ఆ తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో వెలుగు చూసింది. నగరంలోని రెండో జోన్ కాలనీకి చెందిన వీర వేని- సత్యనారాయణ దంపతులకు ఇద్దరు సంతానం. ఇందులో కూతురైన నాగ సత్యవాణిని హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన మురళీవేణుకు ఇచ్చిన 2019లో పెళ్లి జరిపించారు తల్లిదండ్రులు.ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు సంతానం ఉన్నారు. అందులో కుమారుడు రుద్రాక్ష్(5), కూతురు తన్విక(2) ఉన్నారు.

అంతా సాఫీగా సాగుతుంది అనుకన్న సందర్భంలో సత్యవాణి సంచలన నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి చంపేసే ప్రయత్నం చేసింది. తల్లి దాడిలో కూతురు తన్విక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా, కొడుకు రుద్రాక్ష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఇద్దరు పిల్లలు చనిపోయారనుకున్న తల్లి కూడా ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అప్పుడే ఇంటికొచ్చిన భర్త ఫ్యాన్‌కు వేలాడుతున్న భార్యను చూసి షాక్ అయ్యాడు. అదే రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న కూతురు తన్వికను వెంటనే హాస్పిటల్‌కు తరలించాడు. ప్రస్తుతం బాలిక హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది.

ఇక జరిగిన విషయాన్ని మురళి భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలియజేశాడు. అది విన్న వాణి కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌ చేరుకొని వాణి, రుద్రాక్ష్ మృతదేహాలను సొంతూరికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి కొడుకులకు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడంతో అటు వాణి, ఇటు మురళి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదిలా ఉండగా వరకట్నం వేధింపుల కారణంగానే తన చెల్లి చనిపోయిందని.. తన మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని వాణి సోదరుడు, బంధువులు ఆరోపించారు. ఈ నెల 13న రాత్రి 8.30 గంటల సమయంలో తన సోదరి వాణి వీడియో కాల్లో తనతో మాట్లాడిందని, పిల్లలను సైతం చూపించిందని అమె సోదరుడు తెలిపాడు. ఇది జరిగిన గంట తర్వాత వేణు ఫోన్ చేసి ఇద్దరు పిల్లలను చంపి వాణి కూడా ఆత్యహత్యకు పాల్పడిందని చేశారన్నాని పేర్కొన్నాడు. మురళీవేణుకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక ఇబ్బందులు పెట్టేవాడని తెలిపారు.తన చెల్లితోపాటు అల్లుడు మృతి పట్ల అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్
పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..
పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..