AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narsampet: వామ్మో.. 6 అడుగుల నాగుపామును పట్టి.. దానికి స్నానం చేయించి.. ఆపై..

వరంగల్ జిల్లా నర్సంపేటలో పట్టణంలోని నెహ్రూనగర్ కాలనీలో ఆరడుగుల నాగుపాము కనిపించి స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఇంటి పరిసరాల్లోకి వచ్చిన పామును చూసి కాలనీ ప్రజలు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని దాని జాగ్రత్తగా రెస్క్యూ చేశాడు..

G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Mar 16, 2026 | 4:54 PM

Share

వరంగల్ జిల్లా నర్సంపేటలోని నెహ్రూనగర్ కాలనీలో ఆరడుగుల నాగుపాము హల్చల్ చేసింది. ఇంటి పరిసరాల్లోకి ప్రవేశించిన పాము అక్కడున్న ప్రజలను పరుగులు పెట్టించింది.. వారంతా దాదాపు గంటకు పైగా పామును చూసి తీవ్ర భయంతో పరుగులు తీశారు. చివరకు స్నేక్ క్యాచర్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.  ఈ ఘటన నర్సంపేటలోని నెహ్రు కాలనీలో జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. ఆరడుగుల నాగుపాము హల్చల్ చేసింది.. బుసలు కొడుతూ అక్కడ ప్రజలను కాసేపు వనికించింది.. పామును చూసిన కాలనీ ప్రజలు పరుగులు పెట్టారు.. ఇంట్లో ఉన్నవాళ్లు వామ్మో పామంటూ హడలెత్తిపోయారు. స్థానికులు స్నేక్స్ క్యాచర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్స్ క్యాచర్ ఆ పామును చాకచక్యంగా పట్టాడు. ఆ పాముకు మొత్తం బురద ఉండడంతో పట్టిన పామును నీళ్లతో కడిగి పక్కనే ఉన్న పాకాల అడవుల్లోకి తీసుకెళ్లి విడిచి పెట్టారు. అయితే నివాస గృహాల మధ్యకు అంతపెద్ద పాము రావడంతో కాలనీవాసులంతా భయాందోళన చెందుతున్నారు.

అయితే వేసవికాలం మొదలై.. వేడి తాపం పెరగడంతో.. పాములు జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని.. అవి కానీ.. ఇతర వన్యప్రాణులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అటవీ సిబ్బంది కోరుతున్నారు. వాటికి హాని తలపెట్టవద్దని సూచిస్తున్నారు.

Also Read: జీవితం నీటి బుడగ అంటే ఇదేనేమో.. గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి..

Follow Us
ఈ చిన్న పదార్థం మీ బంగారు నగలకు పెద్ద శత్రువు! జస్ట్‌ టచ్‌చేస్తే
ఈ చిన్న పదార్థం మీ బంగారు నగలకు పెద్ద శత్రువు! జస్ట్‌ టచ్‌చేస్తే
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్
పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..
పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..
హైదరాబాద్ బిర్యానీ కోసం వేల కిలోమీటర్లు దాటి.. ఫారిన్ టూరిస్టుల..
హైదరాబాద్ బిర్యానీ కోసం వేల కిలోమీటర్లు దాటి.. ఫారిన్ టూరిస్టుల..
మహానగరంలో మ్యాట్రిమోనీ మాయగాడు
మహానగరంలో మ్యాట్రిమోనీ మాయగాడు