Watch: ఓరీ దేవుడో.. ఇంత వాయిలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేస్తూ
సోషల్ మీడియాలో మరో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఇంటి పైకప్పుపై నిలబడి విద్యుత్ తీగలపై బట్టలు ఆరబెడుతున్నాడు. అయితే, అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఇదంతా చూసి ఆశ్యర్చంతో నోరెళ్లబెట్టి చూశాడు... షాక్ తగులుతుంది కదా.. ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. దీనికి అతడు..
సోషల్ మీడియాలో అనేక ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని వీడియోలు మిమ్మల్ని నవ్విస్తాయి. కొన్ని మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జనాలు కరెంట్ లేకపోతే ఆ వైర్లను ఎలా ఉపయోగించుకుంటున్నారో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్ అయిన వీడియోలో ఒక వ్యక్తి విద్యుత్ వైర్‌పై బట్టలు ఆరబెడుతుండటం కనిపిస్తుంది. అప్పటికే ఆ చుట్టుపక్కల విద్యుత్ వైర్లపై చాలా బట్టలు వేలాడుతున్నాయి. ఓ వ్యక్తి మరికొన్ని బట్టలు తీసుకొచ్చి విద్యుత్ తీగపై వేస్తున్నాడు. అదేంటని అతన్ని ప్రశ్నించగా, ఈ వైర్లు ఉన్నది ఆరబెట్టడానికే కదా అని చెబుతున్నారు. అయితే, అది అత్యంత ప్రమాదకరమని చెప్పగా.. కరెంటు ఎప్పుడూ ఉండదని చెబుతున్నాడు. కరెంటు వస్తే ఎలా అని, కరెంటు వచ్చి బట్టల వల్ల వైర్లు ఒకదానికొకటి తగిలితే ఏమవుతుంది..? అని అడిగితే ఆ వ్యక్తి మళ్లీ కరెంటు లేదన్నారు. బట్టలు ఆరబెట్టడానికి మాత్రమే కరెంటు తీగలు ఉన్నాయని చెప్పాడు.
ऐसे ही थोड़े कहा जाता है मेरा भारत महान।🤗 pic.twitter.com/r6EqUXWOuF
— Abhimanyu Singh Journalist (@Abhimanyu1305) December 26, 2024
ఆ తర్వాత ఆ వ్యక్తి తన బట్టలన్నీ ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాడు. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై చాలా మంది నుంచి విశేష స్పందన వస్తోంది. అందుకే కరెంట్ కావాలి అని అంటారని ఓ సోషల్ మీడియా యూజర్ రాశారు. ప్రజలు కరెంట్ రాని వైర్లపై బట్టలు ఆరబెడుతున్నారు. కరెంటు అస్సలు రాదు అనేంత నమ్మకం ఉందని ఓ సోషల్ మీడియా యూజర్ రాశాడు. బహుశా అక్కడి ప్రభుత్వం ఈ తీగ ద్వారా విద్యుత్‌ను ఎప్పటికీ సరఫరా చేయకపోవచ్చు అంటూ చాలా మంది కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి