2024 year end report: ఏడాదిలో రూ.5 లక్షల విలువైన ఆహారం తిన్న వ్యక్తి.. జొమాటో ప్రకారం అత్యంత రద్దీ రోజు ఏమిటో తెలుసా..
బెంగళూరుకు చెందిన ఒక పెద్దమనిషి కథ ఈ రోజుల్లో ప్రజలలో చర్చనీయాంశమైంది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వ్యక్తి 2024 సంవత్సరంలో రూ. 5,13,733 విలువైన ఆహారాన్ని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి తిన్నాడు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఈ సమాచారం వెల్లడించింది. ఈ వ్యక్తి గురించి తెలిసిన తర్వాత.. ప్రజలు అతని నువ్వు సూపర్ బాసూ అంటూ కీర్తిస్తున్నారు.
ప్రస్తుతం ఇంటి నుంచి షాపింగ్ చేయడానికి, రెస్టారెంట్ పుడ్ ను ఇంటికే తెప్పించుకుని తినడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తున్నారు. బయట తినే బదులు ఇంటి నుంచి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఇలా చేయడం వలన ట్రాఫిక్ జామ్ వంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లోనే కూర్చుని నచ్చిన , మెచ్చిన రుచికరమైన ఆహారాన్ని తింటున్నారు. జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీలు ప్రస్తుతం బాగాపాపులర్ అవ్వడానికి ఇదే కారణం. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో లక్షల రూపాయల విలువైన ఆహారాన్ని ఆర్డర్ చేశాడనే వార్తతో ఆన్ లైన్ లో ఆహరాన్ని ఎలా అర్ధర్ చేస్తున్నారో అంచనా వేయవచ్చు.
ప్రతి సంవత్సరం చివరిలో.. కంపెనీలు తమ మొత్తం సంవత్సర డేటాను పంచుకుంటాయి. ఏ సినిమాలు చూశారు. ఏ చిత్రం సంచలనం సృష్టించింది? ఎవరు ఎంత తిన్నారు, ఎంత ఏ సంస్థకు ఆర్డర్ చేశారు? వంటి విషయాలను షేర్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రముఖ ఆన్ లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ అందించే జొమాటో కూడా తన సొంత నివేదికను కూడా విడుదల చేసింది. బెంగళూరుకు చెందిన ఓ ఆహార ప్రియుడు 2024లో రూ.5 లక్షల విలువైన ఆహారం తిన్నాడని వెల్లడించింది.
జొమాటో నివేదిక ప్రకారం అనమ్ అనే వ్యక్తి ఆహార ప్రియుడు. అందుకే అతను 2024లో జొమాటో నుంచి 5 లక్షలకు విలువ జేసే మీల్స్ ఆర్డర్ చేశాడు. జొమాటో ప్రకారం అతను 2024 సంవత్సరంలో రూ. 5,13,733 ఖర్చు చేశాడు. ఫుడ్ ఆర్డర్‌కు సంబంధించిన విషయలతో పాటు ప్రజల తిన్న డేటాను కూడా జొమాటో పంచుకుంది. 2024లో జొమాటో ద్వారా 1 కోటి కంటే ఎక్కువ టేబుల్స్ రిజర్వ్ చేసుకున్నారని వెల్లడించింది.
జొమాటో ప్రకారం అత్యంత రద్దీ రోజు?
అంతేకాదు డిసెంబర్ 6న ఫాదర్స్ డే సందర్భంగా తమకు అత్యంత రద్దీగా ఉన్న రోజు అని పేర్కొంది. ఆ రోజున, 84,866 మంది తమ తండ్రులతో కలిసి లంచ్ లేదా డిన్నర్‌ను ఎంజాయ్ చేశారు. ఇది మాత్రమే కాదు జొమాటో నగరాలకు సంబంధించిన డేటాను కూడా విడుదల చేసింది. బడ్జెట్ పరంగా ఢిల్లీ ముందంజలో ఉందని తెలిపింది. బడ్జెట్‌కు అనుకూలమైన ఆహారం విషయంలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. జొమాటో ద్వారా ఢిల్లీ వాసులు తమ ఆహార బిల్లులపై రూ.195 కోట్లు ఆదా చేసుకున్నారని వెల్లడించింది. ఢిల్లీ తర్వాత బెంగళూరు, ముంబై వరసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి.
బిర్యానీ వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా దేశంలో అత్యంత ఇష్టమైన వంటకంగా మారిందని జొమాటో తెలిపింది. జొమాటో కస్టమర్లు 2024లో 9,13,99,110 ప్లేట్ల బిర్యానీని ఆర్డర్ చేశారు. జొమాటోలో బిర్యానీ తర్వాత, పిజ్జాలు ఎక్కువగా ఆర్డర్ చేశారని వెల్లడించింది. అలాగే జొమాటో2024 సంవత్సరంలో 77,76,725 టీ ఆర్డర్‌లను బుక్ అయినట్లు.. ఇక కాఫీ అయితే 74,32,856 ఆర్డర్స్ బుక్ అయినట్లు వెల్లడించింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..