AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదరహో అనిపించే గాజు వంతెన.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే.! వీడియో చూశారా

గ్లాసు వంతెన.. ఇది ఎక్కడానికి ఇప్పుడు మన విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇక్కడే మన ఇండియాలోని తమిళనాడులో ఆ రాష్ట్ర ప్రభుత్వం అదరహో అనిపించే గాజు వంతెనను నిర్మించింది. మరి దాని విశేషాలు ఎంతో ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.!

అదరహో అనిపించే గాజు వంతెన.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే.! వీడియో చూశారా
Glass Bridge In Chenna9i
Ravi Kiran
|

Updated on: Dec 30, 2024 | 9:30 AM

Share

తమిళనాడు ప్రజలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌, తిరువళ్లువర్‌ విగ్రహం మధ్య చేపట్టిన గాజు వంతెన పూర్తయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గాజు వంతెనను డిసెంబర్ 30న తమిళనాడు సీఎం స్టాలిన్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. అలాగే సోమవారం నుంచే ఈ గ్లాస్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రానుంది. తమిళనాడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షణలో చెన్నైకి చెందిన VME ప్రీకాస్ట్ ప్రొడక్ట్స్ కంపెనీ ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. రెండు వైపులను కనెక్ట్ చేసేలా.. పైకప్పును ఉక్కుతో రూపొందించారు. అలాగే ఈ వంతెనను స్టీల్ ప్లాట్‌ఫారమ్‌పై రెండున్నర మీటర్ల గాజు పలకలతో నిర్మించారు. కన్యాకుమారి త్రివేణి సంగమంలోని తిరువళ్లువర్ విగ్రహం రజతోత్సవ వేడుకలు డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు.

గాజు వంతెన నిర్మాణ వివరాలు..

నిర్మాణ వ్యయం – 37 కోట్లు

పొడవు – 77 మీటర్లు

వెడల్పు – 10 మీటర్లు

మరోవైపు జనవరి 1, 2000వ సంవత్సరంలో తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రారంభించారు అప్పటి సీఎం కరుణానిధి. ఈ పీఠం 133 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. 2004లో వచ్చిన సునామీని సైతం ఈ విగ్రహం తట్టుకుంది. ఆ సమయంలో ఈ విగ్రహానికి ఎలాంటి నష్టం జరగలేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..