Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సీజన్ లో ముల్లంగి ఆరోగ్యానికి మంచిదే.. ఈ సమస్యలున్నవారు ముల్లంగి పరాఠాను తినొద్దు.. ఎందుకంటే

ఆరోగ్యాన్ని ఇచ్చే దుంపల్లో ముల్లంగి ఒకటి. ఇది శరీరానికి సహజమైన డిటాక్స్‌గా పనిచేస్తుంది. అదే సమయంలో.. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో ఎక్కువగా దొరికే కూరగాయల్లో ఒకటైన ముల్లంగితో రకరకాల ఆహార పదార్ధాలు తయారు చేసుకుంటారు. అలాంటి ఆహారంలో ఒకటి ముల్లంగి పరాటా. దీనిని కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఈ సీజన్ లో ముల్లంగి ఆరోగ్యానికి మంచిదే.. ఈ సమస్యలున్నవారు ముల్లంగి పరాఠాను తినొద్దు.. ఎందుకంటే
Radish Paratha
Follow us
Surya Kala

|

Updated on: Dec 30, 2024 | 8:29 AM

చలికాలంలో రకరకాల ఆహారం తినాలని కోరుకుంటారు. ముఖ్యంగా టీతో పాటు వేడి వేడి పకోడి, బజ్జీలు, చపాతీ, పరాఠాలను తినాలని ఎక్కువ మంది కోరుకుంటారు. ఈ సీజన్‌లో పరాఠాలను తినాలనుకుంనేవారు వివిధ రకాల పరాఠాలను తినడానికి ఇష్టపడతారు. శీతాకాలంలో ముల్లంగి తక్కువ ధరకే దొరుకుతుంది.. ఈ నేపధ్యంలో ఈ సీజన్ లో దొరికే ముల్లంగితో చేసిన పరాఠాలను తినడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తారు. వీటి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.

ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని .. ముఖ్యంగా చలికాలంలో ముల్లంగి తినడం ఆరోగ్యం అని డైటీషియన్ మోహిని డోంగ్రే చెబుతున్నారు. దీని ఎక్కువ మొత్తంలో విటమిన్ సి శారీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుందని అన్నారు. ముల్లంగి తినడం ఆరోగ్యకరం అయితే కొంతమంది ముల్లంగి పరాఠాలు తినకూడదని నిపుణులు అంటున్నారు. ఈ రోజు ఈ ముల్లంగి పరాఠాలను ఏ వ్యక్తులు తినకూడదో తెలుసుకుందాం..

జీర్ణ సమస్యలు

ముల్లంగి పరాఠాను జీర్ణం చేసుకోవడం అందరికీ అంత సులభం కాదు. ముఖ్యంగా ఎవరికైనా జీర్ణవ్యవస్థ సెన్సిటివ్‌గా ఉంటే ముల్లంగి పరాటాలు తినవద్దు. ముల్లంగి పరాఠాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. అపానవాయువు, గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

థైరాయిడ్ సమస్య ఉంటే

థైరాయిడ్ గ్రంధి పనితీరును ప్రభావితం చేసే ముల్లంగిలో గోయిట్రోజెన్ అనే మూలకాలు కనిపిస్తాయి. హైపోథైరాయిడిజం రోగులు ముల్లంగిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే ముల్లంగి పరాఠాలను తినే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి

గర్భిణీ స్త్రీలు

గర్భిణీ స్త్రీలు ముల్లంగి పరాఠాను తినే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ముల్లంగిలో విటమిన్ సి, ఫైబర్, మినరల్స్ ఉన్నప్పటికీ.. ముల్లంగిని అధికంగా తినడం గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అటువంటి సందర్భాలలో మహిళలు దీనిని తినకూడదు.

అధిక రక్తపోటు

అధిక రక్తపోటు ఉన్నవారు కూడా ముల్లంగి పరాఠాలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ముల్లంగి నుంచి నీరుని తీయడానికి ఉప్పును ఉపయోగిస్తారు. అప్పుడు ఎక్కువ ఉప్పు కలుపుతారు. అందువల్ల అధిక సోడియం కారణంగా రక్తపోటు పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!