New Year 2025: ఈ న్యూయర్‌కి ఇంట్లోనే పిల్లలకు ఈజీగా ‘బటర్ స్కాచ్’ ఐస్‌క్రీమ్ చేయండి..

ఐస్ క్రీమ్ అంటే పిల్లలకు బాగా ఇష్టం. పిల్లలకే కాదు.. పెద్దలు కూడా ఇష్టంగానే తింటూ ఉంటారు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్‌ క్రీమ్‌ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ న్యూయర్‌కి ఈ స్పెషల్‌గా ఈ ఐటెమ్ చేసి పిల్లలను సర్ ప్రైజ్ చేయండి. పిల్లలు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయి ఈ ఐస్ క్రీమ్‌ని ఎంజాయ్ చేస్తారు..

New Year 2025: ఈ న్యూయర్‌కి ఇంట్లోనే పిల్లలకు ఈజీగా 'బటర్ స్కాచ్' ఐస్‌క్రీమ్ చేయండి..
Butterscotch Ice Cream
Follow us
Chinni Enni

| Edited By: TV9 Telugu

Updated on: Dec 30, 2024 | 11:06 AM

బయట ఫుడ్ తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. బయట ఎలా తయారు చేస్తారో.. పదార్థాలను శుభ్రం కలుపుతారో లేదో అన్న డౌట్ ఖచ్చితంగా అందరిలో వచ్చే ఉంటుంది. అలాగే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్‌ క్రీమ్‌కి కూడా వర్తిస్తుంది. ఐస్ క్రీమ్ తయారీ వీడియోలు చాలానే చూసి ఉంటారు. ఏమాత్రం పరి శుభ్రత పాటించకుండా రసాయనాలు కలిపి చేస్తూ ఉంటారు. కానీ మనం ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ న్యూయర్‌కి ఈ స్పెషల్ ఐటెమ్ చేసి పిల్లలను సర్ ప్రైజ్ చేయండి. సమయం పట్టినా.. ఇంట్లో చేసినంత శుభ్రంగా బయట ఎవరూ చేయలేరు. అందరికీ ఇష్టమైన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇంట్లో ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్‌కి కావాల్సిన పదార్థాలు:

పాలు, ఫ్రెష్ క్రీమ్, పంచదార, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బటర్ ఎసెన్స్, ఫుడ్ కలర్, కస్టర్ పౌడర్, నెయ్యి

బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్‌ తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో అర లీటర్ వరకు పాలు వేసి మరిగించండి. మీకు ఎక్కువగా కావాలంటే క్వాంటిటీ పెంచి చేసుకోవచ్చు. ఈ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి నీటిని తీసుకుని అందులో రెండు స్పూన్ల వరకు కస్టర్ పౌడర్ కలపండి. వెనీలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది. బటర్ స్కాచ్ ఎల్లో కలర్‌లో ఉంటుంది కాబట్టి ఫుడ్ కలర్ తీసుకుని కొద్దిగా కస్టర్ పౌడర్‌లోనే కలర్ కలపండి. ఇష్టం లేని వాళ్లు వదిలేయండి. మరుగుతున్న పాలల్లో పావు కప్పు చక్కెర వేసి మిక్స్ చేయండి.

ఇవి కూడా చదవండి

పంచదార కరిగిన తర్వాత కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా వేసి చిన్న మంట మీద ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండండి. ఈ మిశ్రమం చిక్కగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టండి. మరో పాన్ తీసుకుని అందులో పంచదార వేసి కరిగేంత వరకు కలపండి. ఇందులో నెయ్యి లేదా బటర్ వేసుకుంటే రుచిగా ఉంటుంది. బటర్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన జీడిపప్పు పలుకులు కూడా వేయాలి. ఇది క్యారమిల్‌లాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బటర్ రాసిన ప్లేట్‌ మీద రాయాలి. కాస్త ఆరిన తర్వాత కర్రతో కొడితే బటర్ స్కాచ్ తయారవుతుంది. దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిశ్రమంలో వేసి అంతా కలపండి.

ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా తిప్పి అది కూడా కస్టర్డ్ మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఓ బాక్స్‌లోకి తీసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే పై నుంచి సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ చల్లండి. ఆ తర్వాత డీప్ ఫ్రిజ్‌లో ఓ రెండు గంటల పాటు ఉంచాలి లేదంటే రాత్రంతా ఉంచినా పర్వాలేదు. తినే ముందు బౌల్స్‌లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ సిద్ధం.

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..