AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Promissory Note: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాస్తే.. అప్పు ఇచ్చినవాడు చనిపోయినా మీ డబ్బు వెనక్కి

ప్రామిసరీ నోట్ల వినియోగం, వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓ హైకోర్టు అడ్వకేట్ వివరించారు. చాలామంది కేవలం నమ్మకంతో ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకం చేసి ఇస్తుంటారని, ఇది భవిష్యత్తులో తీవ్రమైన న్యాయపరమైన ఇబ్బందులకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రామిసరీ నోటు రాసేటప్పుడు..

Promissory Note: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాస్తే.. అప్పు ఇచ్చినవాడు చనిపోయినా మీ డబ్బు వెనక్కి
Promissiory Note
Ravi Kiran
|

Updated on: Mar 16, 2026 | 12:48 PM

Share

డబ్బు లావాదేవీల్లో ప్రామిసరీ నోటు అనేది ఒక కీలకమైన పత్రం. అయితే, దీనిపై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది మోసపోతుంటారు. ప్రముఖ న్యాయవాది ఒకరు ప్రామిసరీ నోట్ల విషయంలో పాటించాల్సిన అతి ముఖ్యమైన అంశాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాధారణంగా ప్రామిసరీ నోటుపై కేవలం సంతకం ఉంటే, అప్పు తీసుకున్న వ్యక్తి కోర్టులో అది తన సంతకం కాదని వాదించే అవకాశం ఉంది. దీనివల్ల న్యాయపోరాటం సుదీర్ఘంగా సాగుతుంది. అయితే, సంతకంతో పాటు వేలిముద్ర(Thumb Impression) కూడా తీసుకుంటే, దానిని ఎవరూ నిరాకరించలేరు. ఫోరెన్సిక్ సైన్స్ ప్రకారం వేలిముద్రను శాస్త్రీయంగా నిరూపించడం సులభం కాబట్టి, ఇది రుణదాతకు 100 శాతం రక్షణ కల్పిస్తుంది. నమ్మకంతో ఖాళీ నోట్లపై సంతకం చేయడం వల్ల.. తర్వాత ఇతరులు తమకు నచ్చిన మొత్తాన్ని అందులో రాసుకునే ప్రమాదం ఉంది. డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మొత్తం సమాచారాన్ని నింపి, సాక్షుల ముందే సంతకాలు తీసుకోవాలి.

ప్రామిసరీ నోటు రాసేటప్పుడు కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలి. వారు కూడా సంతకంతో పాటు వేలిముద్ర వేస్తే మరింత బలం చేకూరుతుంది. నోటు నింపిన వ్యక్తి వివరాలు కూడా స్పష్టంగా ఉండాలి. చాలా మంది అప్పు తీర్చిన తర్వాత ప్రామిసరీ నోటును వెనక్కి తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఇది పెద్ద తప్పిదం. డబ్బు చెల్లించిన వెంటనే నోటును తీసుకోవాలి లేదా దానిపై ‘అమౌంట్ రిసీవ్డ్’ అని రాసి రద్దు చేయాలి. ఒకవేళ నోటు ఇప్పుడే అందుబాటులో లేదని రుణదాత చెబితే, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా డబ్బు చెల్లించినట్లు నోటీసు పంపడం మంచిదని న్యాయవాది సూచించారు. కాగా, న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడానికి చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ప్రామిసరీ నోటు విషయంలో అప్రమత్తంగా ఉండటం వల్ల మీ కష్టార్జితాన్ని, మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చు.

ఇది చదవండి: ఎలాంటి పాము కరిచినా సరే.. ఈ వేరు చప్పరిస్తే విషం వెంటనే విరిగిపోతుంది..

Follow Us