AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కీమ్ అంటే ఇట్లా ఉండాలి.. ఒక్కసారి డబ్బు పెడితే.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ. 9250..

Post Office: డబ్బులు దాచుకోవడం ఒక ఎత్తైతే.. దాచుకున్న సొమ్ముపై ప్రతి నెలా ఆదాయం రావడం మరో ఎత్తు. అది కూడా ప్రభుత్వ భరోసాతో ఎటువంటి రిస్క్ లేకుండా వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది? మధ్యతరగతి ప్రజలకు, సీనియర్ సిటిజన్లకు పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒక వరం అని చెప్పాలి. ఒక్కసారి పెట్టుబడితో ఐదేళ్ల పాటు ప్రతి నెలా ఫిక్స్‌డ్ అమౌంట్ మీ ఖాతాలో పడే ఈ పథకం గురించి తెలుసుకుందాం..

స్కీమ్ అంటే ఇట్లా ఉండాలి.. ఒక్కసారి డబ్బు పెడితే.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ. 9250..
money
Krishna S
|

Updated on: Mar 16, 2026 | 12:31 PM

Share

నేటి అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో సామాన్యులు తమ కష్టార్జితాన్ని భద్రంగా దాచుకోవడంతో పాటు ప్రతి నెలా కొంత స్థిరమైన ఆదాయం రావాలని కోరుకుంటున్నారు. పెట్టుబడి పెట్టేందుకు మార్కెట్లో ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ, సామాన్యులు ఇప్పటికీ సురక్షితమైన మరియు స్థిరమైన రాబడినిచ్చే పథకాలనే కోరుకుంటారు.అటువంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్‌లో ఎన్నో అద్భుత పథకాలు ఉన్నాయి. అందులో పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మంచి ఆప్షన్. ఒక్కసారి పెట్టుబడి పెడితే ఐదేళ్ల పాటు పెన్షన్ లాంటి నెలవారీ ఆదాయాన్ని ఈ పథకం అందిస్తుంది.

ఏమిటీ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్..?

ఇది కేంద్రం మద్దతు ఉన్న సురక్షితమైన పొదుపు పథకం. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారు, మహిళలు, రిస్క్ లేకుండా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఇది అత్యంత ప్రయోజనకరం. ఈ పథకంలో ప్రస్తుతం 7.4శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఐదేళ్ల కాలపరిమితి వరకు ఈ వడ్డీ రేటులో ఎటువంటి మార్పు ఉండదు.

ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?

ఈ పథకంలో సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ తెరిచే అవకాశం ఉంది. సింగిల్ అకౌంట్ అయితే గరిష్టంగా రూ. 9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే భార్యభర్తలు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి ఖాతా తెరవచ్చు. ఇందులో గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కేవలం రూ.1,000 తో కూడా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.

నెలవారీ ఆదాయం లెక్కలివే

మీరు పెట్టే పెట్టుబడి ఆధారంగా ప్రతి నెలా మీకు అందే వడ్డీ మారుతుంటుంది. ఉదాహరణకు మీరు రూ. 3 లక్షలు డిపాజిట్ చేస్తే..నెలకు సుమారు రూ.1,850 వడ్డీ లభిస్తుంది. రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే.. నెలకు సుమారు రూ.5,550 వడ్డీ లభిస్తుంది. అదే రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే: ప్రతి నెలా రూ.9,250 మీ చేతికి అందుతాయి.

ముఖ్యమైన నిబంధనలు

ఈ పథకం ఐదేళ్ల వరకు కొనసాగుతుంది. గడువు ముగిసిన తర్వాత మీ అసలు మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. వడ్డీ డబ్బులు నేరుగా మీ ఖాతాలో పడాలంటే పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. ఖాతా తెరవడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు అవసరం.

ఖాతా తెరవడం ఎలా?

మీ సమీపంలోని పోస్టాఫీసును సందర్శించి అప్లికేషన్ ఫారమ్ నింపడం ద్వారా సులభంగా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ప్రభుత్వ హామీ ఉండటం వల్ల మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది.

Follow Us
శ్రావణ మాసంలో దర్శించాల్సిన ప్రపంచ ప్రసిద్ధ శివాలయాలు
శ్రావణ మాసంలో దర్శించాల్సిన ప్రపంచ ప్రసిద్ధ శివాలయాలు
'విశ్వనాథ్ అండ్ సన్స్'.. 2 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్'.. 2 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొబ్బరి నూనెలో ఇదొక్క కలిపి రాస్తే చాలు.. దెబ్బకు చుండ్రు పరార్
కొబ్బరి నూనెలో ఇదొక్క కలిపి రాస్తే చాలు.. దెబ్బకు చుండ్రు పరార్
తాజ్ మహల్ వద్ద జాతీయ జెండా ఎందుకు ఎగురవేయరు..? చట్టం ఏం చెప్తుందో
తాజ్ మహల్ వద్ద జాతీయ జెండా ఎందుకు ఎగురవేయరు..? చట్టం ఏం చెప్తుందో
ఒకే భోజనంలో అన్నం, చపాతీ రెండూ కలిపి తినొచ్చా?
ఒకే భోజనంలో అన్నం, చపాతీ రెండూ కలిపి తినొచ్చా?
తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. అకౌంట్లోకి నేరుగా రూ.1.50 లక్షలు
తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. అకౌంట్లోకి నేరుగా రూ.1.50 లక్షలు
కోడి కాళ్లను ఇలా ఒక్కసారి తిని చూడండి.. ఆ రోగాల మాటే ఉండదు..
కోడి కాళ్లను ఇలా ఒక్కసారి తిని చూడండి.. ఆ రోగాల మాటే ఉండదు..
7500కు గోల్డ్ షాపులో పని చేసేవాడు..
7500కు గోల్డ్ షాపులో పని చేసేవాడు..
పీరియడ్స్ క్రమం తప్పుతున్నాయా? అస్సలు నిర్లక్ష్యం చేయకండి
పీరియడ్స్ క్రమం తప్పుతున్నాయా? అస్సలు నిర్లక్ష్యం చేయకండి
రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్
రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్