India Inc Hiring: శుభసూచకంగా కొత్త ఏడాది.. ఉద్యోగ నియామకాలకు క్యూ కడుతోన్న బడా కంపెనీలు

వచ్చే ఏడాది ఉపాధి అవాకాశాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి కొత్త సాంకేతికతల్లో నైపుణ్యం కలిగిన యువతతో బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ మేరకు రాబోయే ఏడాది కాలంలో వర్క్‌ఫోర్స్‌ను మరింత విస్తరించే అవకాశం దండిగా కనిపిస్తుంది. దీనిపై ఆయా కంపెనీల యాజమన్యాలు ఏం చెబుతున్నాయో మీరే చూడండి..

India Inc Hiring: శుభసూచకంగా కొత్త ఏడాది.. ఉద్యోగ నియామకాలకు క్యూ కడుతోన్న బడా కంపెనీలు
India Inc Hiring
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 29, 2024 | 12:23 PM

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 29: ఉపాధి అవాకాశాలు అందిపుచ్చుకోవడానికి అధిక మంది యువత ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి కొత్త సాంకేతికతలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ విభాగాల్లో నియామకాలపై కంపెనీలు సైతం దృష్టి సారించడంతో ఇండియా Inc రాబోయే ఏడాది కాలంలో వర్క్‌ఫోర్స్‌ను మరింత విస్తరించే అవకాశం కనిపిస్తుంది. Colgate-Palmolive, DS Group, KPMG, Deloitte, Tata Steel, Tech Mahindra, Meesho వంటి సంస్థలు తమ ఎగ్జిక్యూటివ్‌లను 2025లో అప్‌డేట్ చేస్తున్నాయి. ఈ కంపెనీల్లో చాలా వరకు నియామకాలు పుంజుకోనున్నాయి. కంపెనీలు కూడా ఇప్పటికే ఉన్న శ్రామిక శక్తి నైపుణ్యాల పెంపుపై దృష్టి సారిస్తున్నాయి.

CIEL HR అన్ని రంగాల నియామక విశ్లేషణ ప్రకారం.. 2024తో పోలిస్తే 2025లో ఉద్యోగ నియామకాల్లో కనీసం 10% పెరుగుదలను సూచిస్తుంది. సెమీకండక్టర్, స్టార్టప్‌లు, సైబర్‌ సెక్యూరిటీ, పునరుత్పాదక ఇంధనం, AI, GCC వంటి రంగాలలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు పెరుగుతాయని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిత్య మిశ్రా తెలిపారు. DS గ్రూప్ కొత్త ఉత్పత్తుల లాంచ్‌, విస్తరణ ప్రణాళికలకు మద్దతు ఇవ్వడానికి వచ్చే ఏడాది తన ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని యోచిస్తోంది. అలాగే కోల్‌గేట్-పామోలివ్ కూడా తన శ్రామిక శక్తిని పెంచుకోనుంది. ఇక ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఈ-కామర్స్ సంస్థ మీషో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌మెంట్‌ ద్వారా నియామకాలు చేపట్టనుంది. గ్లోబల్ ఆర్గనైజేషన్ భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నట్లు కోల్గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ EVP HR బాలాజీ శ్రీనివాసన్ అన్నారు.

వేగవంతమైన వృద్ధిని సాధించేందుకు మీషో 2024 ఏడాదికి 500 మంది మహిళలు సహా 1700 మంది ఉద్యోగులు నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల నుంచి విభిన్నమైన యువ నిపుణులను ఆకర్షించడం ద్వారా సీషో వచ్చే ఏడాది ఇదే వేగాన్ని కొనసాగించాలని భావిస్తు్న్నట్లు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ సింగ్ తెలిపారు. ఉపాధి అవకాశాలపై ఆయన మాట్లాడుతూ.. క్యాంపస్ నియామక ప్రయత్నాలు గణనీయంగా పెరిగాయన్నారు. గతేడాది కంటే దాదాపు మూడు రెట్లు అధికంగా కొత్త నియామకాలు తీసుకోవడమనేది భవిష్యత్తు-సన్నద్ధమైన టాలెంట్ పైప్‌లైన్‌ను నిర్మించడంలో మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ఇంజినీరింగ్ క్యాంపస్‌ల నుంచి దాదాపు 5,000 మందిని నియమించుకోవాలని టెక్ మహీంద్రా యోచిస్తున్నట్లు చీఫ్ పీపుల్ ఆఫీసర్ రిచర్డ్ లోబో తెలిపారు. దశలవారీగా క్యాంపస్‌ నియామకాలను చేపడతామని చెప్పారు. AI, ML, డేటా అనలిటిక్స్ వంటి కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక టాటా స్టీల్ బాహ్య నియామకాలు కాకుండా లోపల నుంచి ట్యాలెంట్‌ పైప్‌లైన్‌ను నిర్మించాలని చూస్తోంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..