Jobs in Electronics Sector: ఉపాధి కల్పనలో ఎలక్ట్రానిక్స్‌ దూకుడు.. వచ్చే మూడేళ్లలో కోటికిపైగా ఉద్యోగాలు

దేశ నిరుద్యోగతను తొలగించడంలో ఎలక్ట్రానిక్స్ రంగం దూసుకుపోతుంది. వచ్చే మూడేళ్లలో ఈ రంగంలో ఏకంగా కోటికిపైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. 2027 నాటికి ఈ రంగంలో 1.2 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని టీమ్‌లీజ్‌ శనివారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది..

Jobs in Electronics Sector: ఉపాధి కల్పనలో ఎలక్ట్రానిక్స్‌ దూకుడు.. వచ్చే మూడేళ్లలో కోటికిపైగా ఉద్యోగాలు
Jobs In Electronics Sector
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 29, 2024 | 11:46 AM

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 29: భారత్‌లో నిరుద్యోగతను తొలగించడంలో ఎలక్ట్రానిక్స్ రంగం దూసుకుపోతున్నది. ఉద్యోగ కల్పనలో ఈ రంగం తనదైన ప్రత్యేక ముద్ర వేయబోతుంది. వచ్చే మూడేండ్లలో అంటే 2027 నాటికి ఈ రంగంలో 1.2 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని టీమ్‌లీజ్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వీరిలో 30 లక్షల మంది ప్రత్యక్షంగాను, మరో 90 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొంది. ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నవారిలో 10 లక్షల మంది ఇంజినీర్లు, 20 లక్షల మంది ఐటీఐ ప్రొఫెషనల్స్‌, 2 లక్షల మంది కృత్రిమ మేధస్సు, మెషిన్‌లెర్నింగ్‌, డాటా సైన్సెస్‌, నాన్‌-టెక్నికల్‌ విభాగానికి చెందిన 90 లక్షల మందికి పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ మేరక శనివారం విడుదలైన టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ నివేదిక వెల్లడించింది. ఆర్థిక వృద్ధికి ఈ రంగం అపారమైన సంభావ్యత కలిగి ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది.

ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ 2030 నాటికి 500 బిలియన్ల డాలర్ల తయారీ ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ రంగం రాబోయే ఐదేళ్లలో ఐదు రెట్లు వృద్ధి చెందాల్సి ఉంది. అలాగే 400 బిలియన్ల డాలర్‌ ఉత్పత్తి అంతరాన్ని తగ్గించాలి. ప్రస్తుతం దేశీయ ఉత్పత్తి 101 బిలియన్‌ డాలర్ల వద్ద ఉంది. ఇందులో మొబైల్ ఫోన్‌లు 43 శాతం, వినియోగదారు, పారిశ్రామిక ఎలక్ట్రానిక్స్ ఒక్కొక్కటి 12 శాతం చొప్పున, ఎలక్ట్రానిక్ భాగాలు 11 శాతం, ఆటో ఎలక్ట్రానిక్స్ 8 శాతం, ఎల్‌ఈడీ లైటింగ్ 3 శాతం, వేరబుల్స్ అండ్‌ హియరబుల్స్ 1 శాతం, పీసీబీఏలు 1 శాతం చొప్పున వృద్ధి సామర్థ్యాన్ని అందిస్తున్నాయని నివేదిక పేర్కొంది. 101 బిలియన్‌ డాలర్ల విలువైన భారత్‌ ఎలక్ట్రానిక్స్ రంగం.. వచ్చే మూడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ హబ్‌గా వేగంగా మారనుందని టీమ్‌లీజ్ డిగ్రీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సుమిత్ కుమార్ అన్నారు.

గ్లోబల్ వాల్యూ చైన్‌లలో ఈ రంగం 4 శాతం భాగస్వామ్యం ఉన్నప్పటికీ, డిజైన్ అండ్‌ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్‌ని చేర్చడానికి ముందుకు అడుగులు వేయడం ద్వారా ఈ రంగం అపారమైన వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఉపాధి కల్పన పెరగనుంది. భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని పెంపొందించడానికి అప్రెంటిస్‌షిప్‌లు, రీస్కిల్లింగ్ , అప్‌స్కిల్లింగ్‌పై బలమైన దృష్టితో బహుళ-కోణాల విధానం అవసరం అవుతుందని కుమార్ చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ’, PLI పథకాలు, ‘డిజిటల్ ఇండియా’ వంటి కార్యక్రమాల ద్వారా భారత్‌ ఎలక్ట్రానిక్స్ రంగం విశేషమైన వృద్ధిని సాధించినట్లు టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ సీఈవో ఏఆర్‌ రమేష్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.