ల్యాండింగ్ టైమ్‌లో విమాన చక్రం మిస్.. ఆ తర్వాత ??
ఇటీవల విమానాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. మొన్నీమధ్య విమానంలో టాయ్‌లెట్లు పనిచేయడంలేదని 10 గంటలు ప్రయాణించిన తర్వాత గుర్తించి ఆ విమానాన్ని మళ్లీ బయలుదేరిన చోటికే తిరిగి రప్పించారు పైలట్లు. ఇప్పుడు ఓ విమానానికి ల్యాండింగ్ చేస్తుండగా చక్రం కనిపించకుండాపోయింది.
అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం లేకుండా విమానం ల్యాండ్ అయింది కానీ లేదంటే పెను ప్రమాదమే జరిగేది. ఈ ఘటన లాహోర్ విమానాశ్రయంలో జరిగింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఓ దేశీయ విమానానికి ఈ ఊహించని ఘటన ఎదురైంది. లాహోర్‌లో ల్యాండింగ్ సమయంలో ఓ చక్రం లేకపోవడాన్ని గుర్తించారు. అయితే.. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పీఐఏ విమానం PK-306 కరాచీ నుంచి లాహోర్‌కు బయలుదేరింది. లాహోర్ విమానాశ్రయంలో దిగిన తర్వాత కెప్టెన్ సాధారణ తనిఖీ చేశారు. ఆ సమయంలో విమానం వెనక చక్రాల్లో ఒకటి లేదని గుర్తించారు. అయినప్పటికీ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యిందని పీఐఏ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు పీఐఏ విమానయాన సంస్థ వెల్లడించింది. కరాచీలో బయలుదేరేటప్పుడే మిస్సయ్యిందా లేక టేకాఫ్ సమయంలో ఊడిపోయిందా? లేదా చక్రాన్ని ఎవరైనా తస్కరించారా? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రీల్స్ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత.. క్లైమాక్స్ లో దిమ్మతిరిగే సీన్
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..