Pawan Kalyan: మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది’ పవన్ ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అత్యున్నత పురస్కారం చేరింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవలకుగానూ యూకే పార్లమెంటులో బ్రిడ్జ్ ఇండియా సంస్థ, కల్చరల్ లీడర్షిప్ ద్వారా 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ ను ప్రదానం చేసింది. చిరంజీవికి ఈ పురస్కారం రావడంపై పవన్‌కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు.
ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందంటూ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ పురస్కారం చిరంజీవి కీర్తిని మరింత పెంచిందన్నారు. సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడిగా జీవితం మొదలుపెట్టి.. స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో మెగాస్టార్‌గా ఎదిగారన్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్నారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంటుందన్న ఆయన చిరంజీవిని అన్నయ్యగా కంటే తండ్రి సమానుడిగా భావిస్తానని తెలిపారు. తాను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంగా ఉన్నప్పుడు తనకు మార్గం చూపించిన వ్యక్తి అన్నయ్య అని, తన జీవితానికి హీరో చిరంజీవి అని పేర్కొన్నారు. తన సేవాగుణంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటు మరెంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం చేశారని తెలిపారు. ప్రతిభ ఉంటే ఎవరైనా ఏ రంగంలోనైనా రాణించవచ్చు అనడానికి ఉదాహరణగా నిలిచారన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Puri Jagannadh: వావ్! పూరీకి హీరో దొరికేశాడోచ్
బెట్టింగ్ యాప్ కేసులో ED ఎంట్రీ! తీవ్ర చిక్కుల్లో ఆ 11 మంది
Tasty Teja: పోలీసులకు షాకిచ్చిన టేస్టీ తేజ
Nayanthara: దారుణంగా తిట్టి అవమానించాడు…స్టార్ డైరెక్టర్ పై నయన్ తీవ్ర ఆరోపణలు