Nayanthara: దారుణంగా తిట్టి అవమానించాడు…స్టార్ డైరెక్టర్ పై నయన్ తీవ్ర ఆరోపణలు
సినిమా ఫీల్డ్‌లో తిట్లు కామన్. ఇప్పడు స్టార్ హీరోలుగా కంటిన్యూ అవుతున్న వాళ్లు.. అప్పట్లో ఏదో ఒక డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ చేత తిట్లు తిన్నవాళ్లే.. సినిమా ఛాన్సుల కోసం వాళ్ల వెంట పడిన వాళ్లే. అయితే నయన్ కూడా తన కెరీర్ బిగినింగ్‌లోని అలాంటి ఓ సంఘటన గురించి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
డైరెక్టర్ పార్థీబన్ అప్పట్లో తనను అందరి ముందు తిట్టి అవమానించాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎస్ ! డైరెక్టర్‌గా.. యాక్టర్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనేంటో నిరూపించుకున్న పార్థీబన్.. అప్పట్లో తన సినిమా కోసం నయన్‌ను ఆడిషన్ చేశారట. ఆ సినిమాతోనే నయన్ ఇండస్ట్రీకి పరిచయం కూడా అవ్వాల్సిందట. అయితే ఆ సినిమా ఆడిషన్లో నయన్ సెలక్ట్ అయినప్పటికీ… ఆ సినిమా ఫస్ట్ డే షూట్‌కు నయన్ ఆలస్యంగా వచ్చిందట. దీంతో పార్థీబన్ కోపంతో నయన్ మీద ఊగిపోయాడట. అందరి ముందే తెగ తిట్టిపోశారట.నువ్వు ఈ సినిమాకు అవసరం లేదు, వెళ్ళిపో అంటూ అరిచాడట. దీంతో నయన్ అక్కడి నుంచి వెళ్లియారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రగ్స్‌తో అప్రతిష్ట! షాకింగ్ నిర్ణయం తీసుకున్న హేమ
ఇక ఆధార్, మొబైల్‌తో ఓటర్ఐడీ లింక్ తప్పనిసరి
నాని Vs మోహన్ బాబు.. రసవత్తరమైన ఫైట్!
Chiranjeevi: లండన్‌లో మహిళా అభిమాని చేసిన పనికి చిరంజీవి రియాక్షన్
Manchu Manoj: ‘నిన్ను కలిసేందుకు ఎదురుచూస్తున్నా నాన్న’ మనోజ్ ఎమోషనల్ ట్వీట్