నాని Vs మోహన్ బాబు.. రసవత్తరమైన ఫైట్!
ఆఫ్టర్ కోర్ట్ రిలీజ్ ఇప్పుడు ఎక్కడ చూసినా.. నాచురల్ స్టార్ నాని పేరే వినిపిస్తోంది. అటు ప్రొడ్యూసర్‌గా.. ఇటు హీరోగా ఆయన ఎంచుకుంటున్న స్క్రిప్ట్స్ పైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే హిట్ 3 సినిమా షూట్ కంప్లీట్ చేసిన నాని... ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ది పారడైజ్ సినిమాకు కమిట్ అయ్యారు. ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్‌తో అందర్నీ షాకయ్యేలా కూడా చేశాడు.
ఇక ఇప్పుడు ఈ మూవీలో నానికి విలన్‌గా మోహన్ బాబు సెట్టయ్యాడన్న న్యూస్‌తో మరో సారి అందర్నీ షాకయ్యేలా చేస్తున్నాడు ఈ నాచురల్ స్టార్. ఎస్ ! ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో పాటే.. క్యాస్టింగ్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. తన పారడైజ్ సినిమాలో నానికి విలన్‌గా మోహన్ బాబును సెట్ చేయాలని చూస్తున్నారట. ఇందుకోసం చాలా గట్టిగానే ట్రై చేస్తున్నారట. అందుకు మోహన్ బాబు కూడా ఆల్మోస్ట్ ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్‌లో ఓ టాక్ రన్ అవుతోంది. ఇక మోహన్ బాబుతో పాటు ఈ సినిమా పీపుల్స్ స్టార్ ఆర్ . నారాయణ మూర్తిని కూడా ఓ కీ రోల్లో నటింపజేస్తున్నారట ఓదెల. అయితే ఈ రెండు న్యూస్‌లపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకపోయినప్పటికీ… ఫిల్మ్ సిటీలో మాత్రం కాస్త గట్టిగానే టాక్ నడుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: లండన్‌లో మహిళా అభిమాని చేసిన పనికి చిరంజీవి రియాక్షన్
Manchu Manoj: ‘నిన్ను కలిసేందుకు ఎదురుచూస్తున్నా నాన్న’ మనోజ్ ఎమోషనల్ ట్వీట్
ఈ ముగ్గురూ దేవుళ్లే..! తెలుగు వాళ్ల గుండెల్లో మోగుతున్న అన్వేష్ మాటలు
పెళ్లి చేసుకోమని శ్రీదేవి రిక్వెస్ట్.. అప్పట్లో షాకిచ్చిన మురళీ మోహన్
మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండి బాబోయ్..! మీకు దండేసి దండం పెడతాం