Chiranjeevi: లండన్‌లో మహిళా అభిమాని చేసిన పనికి చిరంజీవి రియాక్షన్
యూకే పార్లమెంట్‌లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడి హీత్రూ విమానాశ్రయంలో చిరంజీవి అభిమానులు, తెలుగు ప్రవాసుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో మెగాస్టార్‌కు బుగ్గపై ఓ మహిళా అభిమాని ముద్దుపెట్టి తన అభిమానాన్ని చాటారు.
ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆ మహిళా అభిమాని కుమారుడు స్పందిస్తూ.. చిన్నప్పుడు చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాలని తాను అల్లరి చేసేవాడినని, అలాంటిది ఇప్పుడు తాను తన తల్లిని చిరంజీవి వద్దకు తీసుకెళ్లానని ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. తన తల్లికి చిరంజీవి అంటే ఎంతో అభిమానమని ఎలాగైనా అమ్మకు చూపించాలనుకున్నానని అది ఇలా నెరవేరడం సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా, మెగాస్టార్ చిరంజీవిని మార్చి 19న యూకే పార్లమెంట్‌లో జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరిస్తారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ బ్రిటన్ కి చెందిన అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా… మెగాస్టార్‌ను ఇతర ఎంపీల సమక్షంలో సన్మానిస్తారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ… సినిమా, ప్రజాసేవ.. దాతృత్వానికి చిరు చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం చేయనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manchu Manoj: ‘నిన్ను కలిసేందుకు ఎదురుచూస్తున్నా నాన్న’ మనోజ్ ఎమోషనల్ ట్వీట్
ఈ ముగ్గురూ దేవుళ్లే..! తెలుగు వాళ్ల గుండెల్లో మోగుతున్న అన్వేష్ మాటలు
పెళ్లి చేసుకోమని శ్రీదేవి రిక్వెస్ట్.. అప్పట్లో షాకిచ్చిన మురళీ మోహన్
మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండి బాబోయ్..! మీకు దండేసి దండం పెడతాం