మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండి బాబోయ్..! మీకు దండేసి దండం పెడతాం
ఒడిశాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా తమ భర్తలు మద్యం సేవించి తమను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, ఇంటిని పట్టించుకోవడంలేదని మహిళలు తమ భర్తలపై ఫిర్యాదు చేయడం మనం చూశాం. కానీ కొందరు భర్తలు తమ భార్యలు పెట్టే బాధలనుంచి తమను కాపాడమని పోలీసులను ఆశ్రయించారు.
వారు మద్యం సేవించి ఇల్లు గుల్ల చేయడమే కాకుండా తమను చిత్రహింసలు పెడుతున్నారని లబోదిబోమంటున్నారు. పురుషులకంటే మేమేం తక్కువకాదు.. అనుకున్నారో ఏమో ఆ గ్రామానికి చెందిన మహిళలు మద్యం సేవిస్తూ పురుషులకు ఛాలెంజ్ విసురుతున్నారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బొరిగుమ్మసమితిలోని పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామంలోని కొందరు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. తమ భార్యలు మద్యానికి బానిసలై ఇల్లు గుల్ల చేస్తున్నారని, తాము కష్టపడి సంపాదించుకొస్తుంటే.. ఆడబ్బుతో తాగుతూ.. ఇంటిని గాలికొదిలేస్తున్నారని ఫిర్యాదు చేశారు. గ్రామంలోని కొందరు యువకులు సారా తయారు చేసి విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తాము కూలి చేసి డబ్బులు సంపాదించి తెస్తుంటే తమ భార్యలు ఆ డబ్బులు మొత్తం మద్యానికే ధారబోస్తున్నారని వాపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బీచ్‌లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో వైరల్
ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సికింద్రాబాద్ లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ స్టాప్ రద్దు
నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్
శ్రీదేవి ఏం కొత్త పిల్ల కాదు.. అప్పట్లో ఆస్టార్‌తో ఆడిపాడింది..