బీచ్‌లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో వైరల్
సాధారణంగా వర్షపు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మందిదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతారు. మీరు ఎప్పుడైనా బ్లడ్ రెయిన్‌ను చూశారా? అవును ఇరాన్‌లో రక్తం రంగులో వర్షం కురిసింది. ఇరాన్ లోని రెయిన్ బో ఐలాండ్ లో ఎర్రని రంగులో వర్షం కురిసింది. ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై చేరగానే ఎరుపు వర్ణంలోకి మారిపోయింది.
అది రక్తపు నీరులా ప్రవహించి సముద్రంలోకి చేరింది. ఈ ఎర్రని వర్షపు నీటితో బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారి భయపెడుతోంది. ఏటా ఈ దృశ్యం చూసేందుకు లక్షలాదిగా పర్యాటకులు ఇరాన్ లో వాలిపోతుంటారు. తాజాగా కొంతమంది టూరిస్టులు రెయిన్ బో ఐలాండ్ లో వర్షాన్ని ఎంజాయ్ చేశారు. ఎరుపు రంగులో రక్తాన్ని తలపించేలా పారుతున్న వరద నీటిలో గంతులు వేశారు. సముద్ర తీరంలోని గుట్టలపై పడిన వర్షం జలపాతంలా కిందకు దూకుతుంటే కేరింతలు కొట్టారు. ఈ ఎర్రని ప్రవాహాన్ని ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. పకృతిలోని వింతలకు ఇదొక ఉదాహరణ అని, ఉన్నఫళంగా అక్కడికి చేరాలని ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రెయిన్ బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం ఓ అగ్ని పర్వతం ఉండేదని, దాని నుంచి వెలువడిన లావా చల్లారి ఈ దీవి ఏర్పడిందని ఇరాన్ చరిత్రకారులు చెబుతున్నారు. అక్కడి మట్టిలో ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ చాలా అధిక మోతాదులో ఉంటుందని, వర్షపు నీరు రక్త వర్ణంలోకి మారడానికి కారణం ఇదేనని అంటున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు రెయిన్ బో ఐలాండ్ కు వస్తుంటారని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సికింద్రాబాద్ లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ స్టాప్ రద్దు
నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్
శ్రీదేవి ఏం కొత్త పిల్ల కాదు.. అప్పట్లో ఆస్టార్‌తో ఆడిపాడింది..

ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్ తింటే అద్భుత లాభాలు మీ సొంతం

బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..

వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్
