నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్
దొంగతనానికి కాదేదీ అనర్హం అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇంతకు ముందు ఆలయాలు, లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే ప్రాంగణాల్లో చెప్పులు పోవడం సహజం. కానీ గుమ్మం ముందు విడిచిన చెప్పులు తెల్లారేసరికి మాయమవుతుండటంతో అంతా షాకవుతున్నారు. నగరంలో కొన్నిరోజులుగా ఈ వింత దొంగలు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు.
చేతికి అందినకాడికి దోచుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని మూసారాంబాగ్ పరిధిలోని ఈస్ట్ ప్రశాంత్ నగర్‌లో దొంగలు వింత చోరీకి పాల్పడ్డారు. అపార్ట్‌మెంట్స్‌లో చొరబడి చెప్పులు, బూట్లు ఎత్తుకెళ్లారు. ఏక కాలంలో ఇలా నాలుగు అపార్ట్‌మెంట్లలో దోపిడీకి పాల్పడ్డారు. మైక్రో హెల్త్ సహా నాలుగు అపార్ట్ మెంట్లలో అర్ధ రాత్రి దొంగలు చొరబడి బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్ళిపోయారు. ఉదయం బయటకు వచ్చి చూసిన అపార్ట్‌మెంట్ వాసులకు తమ చెప్పులు, బూట్లు కనిపించకపోవడంతో కంగుతిన్నారు. వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి షాకయ్యారు. ఒక అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్న పోలీస్ ఇన్స్ పెక్టర్, మహిళా ఎస్.ఐ. కు చెందిన డిపార్ట్మెంట్ బూట్లు, చెప్పులు కూడా ఎత్తుకెళ్ళిపోయారు దొంగలు. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీదేవి ఏం కొత్త పిల్ల కాదు.. అప్పట్లో ఆస్టార్‌తో ఆడిపాడింది..
విద్యార్ధులు అల్లరి తట్టుకోలేక.. గుంజీలు తీసిన మాస్టారు..!
Ranya Rao: రన్యా వెనక.. తెలుగు నటుడు.. దిమ్మతిరిగే ట్విస్ట్
Janhvi Kapoor: భయంకరమైన ప్రమాదం.. జాన్వీ కపూర్ ఎమోషనల్
Vishnu Priya: పాపం విష్ణు ప్రియ! 11 మందిలో ఫస్ట్ బుక్కైంది ఈమే..