Janhvi Kapoor: భయంకరమైన ప్రమాదం.. జాన్వీ కపూర్ ఎమోషనల్
ఎట్ ప్రజెంట్ ఓ రెండు బిగ్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. రీసెంట్‌గా జరిగిన వడోదర రోడ్డు ప్రమాదంపై రియాక్ట్ అయ్యారు. తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన గురించి తన ఇన్‌స్టాలో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. గుజరాత్‌లోని వడోదర, నాగరిక కరేలి బాగ్ ప్రాంతంలో మార్చ్ 13 రాత్రి ఓ ఘోర ప్రమాదం జరిగింది.
వేగంగా వస్తూ.. అదుపు తప్పిన కారు.. మూడు ద్విచక్ర వాహనాలు, ప్రయాణీకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. కార్ డ్రైవింగ్ చేసిన వారు స్టూడెంట్స్ అని మద్యం మత్తులో ఉన్నారని.. గుర్తించిన పోలీసులు.. వీరిని అరెస్టు చేశారు. అయితే వారం నుంచి నెట్టింట ట్రెండ్ అవుతున్న ఈ ప్రమాదం గురించి తాజాగా జాన్వీ కపూర్ రియాక్టయ్యారు. ఈ ప్రమాదం తాలూకు వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన జాన్వీ కపూర్.. ఇది ఒక భయంకరమైన ప్రమాదం అని, దాని గురించి ఆలోచించగానే తన కడుపు తరుక్కుపోతుందని తన పోస్ట్ లో కోట్ చేశారు. తన స్టోరీతో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు ఈమె.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishnu Priya: పాపం విష్ణు ప్రియ! 11 మందిలో ఫస్ట్ బుక్కైంది ఈమే..
Samantha: సెలైన్ బాటిల్స్.. మందు బిళ్లలు! ఒక్క ఫోటోతో బయపడ్డ సమంత ఆరోగ్య పరిస్థితి