Samantha: సెలైన్ బాటిల్స్.. మందు బిళ్లలు! ఒక్క ఫోటోతో బయపడ్డ సమంత ఆరోగ్య పరిస్థితి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు వెబ్ సిరీస్ లపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె గతేడాది ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోనే ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది సామ్.
దీంతో పాటు తన సొంత బ్యానర్ లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సామ్ ట్రాలాలా పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో తన టీమ్ తో కలిసి సరదాగా గడిపిన క్షణాలను పంచుకుంది. ఇంత వరకు బాగానే ఉంది కానీ అందులోనే సమంత హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటో కూడా ఉంది. సామ్ షేర్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు కంగారు పడుతున్నారు. సమంతకు ఏమైంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే దీనిపై సమంత కూడా క్లారిటీ ఇవ్వలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara: రూ.100 కోట్లతో ఇల్లు కమ్ స్టూడియో నిర్మించుకున్న నయన్
ఎయిర్‌టెల్ బాటలోనే జియో.. మస్క్‌తో రిలయన్స్ డీల్
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

