ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి
ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెట్టి ఆకలి తీర్చడంలో ఉండే సంతృప్తి ఇంకెందులోనూ ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకే అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదంటారు. ఇది మనుషుల్లోనే కాదు పశుపక్ష్యాదుల్లోనూ ఉంటుంది. సాటి జీవి ఆకలితో అలమటిస్తుంటే అది తమ జాతికి చెందినది కాదని తెలిసినా ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఓ శునకం మేకపిల్ల ఆకలి తీర్చింది.
ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో నునావత్ హేమ్ల అనే మేకల కాపరి ఇంట్లో ఓ మేక మూడు మేకపిల్లలకు జన్మనిచ్చింది. అతని పెంపుడు శునకం కూడా ఇటీవలే పిల్లలకు జన్మనిచ్చింది. హేమ్లా తన మేకలను రోజు మేతకు తోలుకు పోయేటప్పుడు ఈ శునకాన్ని మేకలకు కాపలాగా తోడు తీసుకెళ్తుంటాడు. అలా మేకలతో ఈ శునకానికి స్నేహం కుదిరింది. ఈ శునకం రోజూ మేకలతోపాటు మేతకు వెళ్లి వాటికి రక్షణగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ మేక పిల్లలకు జన్మనిచ్చింది. మేక తన పిల్లలకు సరిపోను పాలు మేక అందించ లేక పోతుంది. ఇది ఆ మేకల కాపరి గమనించలేదు. కానీ ఎప్పుడు మేకల వెంటే ఉండే శునకం పసిగట్టింది. మేకపిల్లలు ఆకలితో అలమటిస్తుంటే వాటికి శునకం పాలిచ్చింది. మేకపిల్ల కూడా తన తల్లి దగ్గర తాగినంత స్వతంత్రంగా శునకం దగ్గర పాలు తాగడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జాతి భేదం లేకుండా మేకకు పాలిస్తున్న శునకాన్ని చూసి ముగ్ధులయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ ఇంటి ఆవరణలో బొప్పాయి చెట్టు ఉందా.. వెంటనే..!
Amitabh Bachchan: కల్కి2పై అమితాబ్ లీక్.. సంబరంలో ఫ్యాన్స్
ఇక యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. ఎంత అంటే
ఈ వయసులో.. చిన్న అమ్మాయితో ముచ్చటగా రొమాన్స్
ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

