Amitabh Bachchan: కల్కి2పై అమితాబ్ లీక్.. సంబరంలో ఫ్యాన్స్
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవరాల్ గా 1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇది వరకే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇప్పుడు ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ రెండవ భాగం కోసం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు.
‘కల్కి 2898 AD’ చిత్రానికి సీక్వెల్ షూటింగ్ మే మధ్యలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘అశ్వత్థామ’ పాత్రను పోషించారు. ఇక సినిమా సీక్వెల్ లోనూ ఆయన పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో బచ్చన్ కూడా కల్కి 2 షూట్ కి సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన ఈ క్రేజీ సీక్వెల్ పై ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఆయన కౌన్ బనేగా కరోడ్‌పతి’ టీవీ షో ప్రమోషన్లలో పాల్గొన్నారు. కేబీసీ పూర్తి చేసిన తర్వాత, కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటున్నారన్నారు. ఇక ఈ క్రేజీ సీక్వెల్ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుందని, జూన్ 15 వరకు షెడ్యూల్ కొనసాగుతుందని సినీ వర్గాలు తెలిపాయి
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. ఎంత అంటే
ఈ వయసులో.. చిన్న అమ్మాయితో ముచ్చటగా రొమాన్స్
ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

