విద్యార్ధులు అల్లరి తట్టుకోలేక.. గుంజీలు తీసిన మాస్టారు..!
విద్యార్ధులు హోం వర్క్ చేయకపోయినా, టైముకి స్కూలుకి రాకపోయినా.. క్లాస్‌లో అల్లరి చేసినా ఉపాధ్యాయులు విద్యార్ధిని దండిస్తారు. ఈ క్రమంలో గోడ కుర్చీ వేయంచడం, గుంజీలు తీయించడం చేస్తారు. అయితే ఎంత చెప్పినా పిల్లలు మాట వినడం లేదని, వారి తీరు మార్చుకోవడంలేదని, ప్రస్తుతం పిల్లల్ని దండించే పరిస్థితి లేదని ఆవేదనతో తానే విద్యార్ధుల ముందు గుంజీలు తీశారు ఓ స్కూలు హెడ్‌మాస్టర్.
ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో మార్పు కనిపించట్లేదని బొబ్బిలి మండలం పెంట జడ్పీ పాఠశాల హెడ్‌మాస్టర్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 13న పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు, ప్రవర్తనపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని…. విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్మాస్టరు గారూ! అంతా కలిసి పనిచేసి, ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ranya Rao: రన్యా వెనక.. తెలుగు నటుడు.. దిమ్మతిరిగే ట్విస్ట్
Janhvi Kapoor: భయంకరమైన ప్రమాదం.. జాన్వీ కపూర్ ఎమోషనల్
Vishnu Priya: పాపం విష్ణు ప్రియ! 11 మందిలో ఫస్ట్ బుక్కైంది ఈమే..
Samantha: సెలైన్ బాటిల్స్.. మందు బిళ్లలు! ఒక్క ఫోటోతో బయపడ్డ సమంత ఆరోగ్య పరిస్థితి

ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్ తింటే అద్భుత లాభాలు మీ సొంతం

బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..

వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్
