TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. RC16లో మెగా స్టార్ | బుల్లిరాజుకు భారీగా డిమాండ్ లక్షల్లో రెమ్యునరేషన్
తన గురువు సుకుమార్ ఇన్‌స్పిరేషన్‌తో.. ఫిల్మ్ మేకింగ్‌లో వండర్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నట్టు ఉన్నారు బుచ్చిబాబు సనా! అందు కోసమే అన్నట్టు తన నెక్ట్స్ ఫిల్మ్ ఆర్సీ 16లో క్రేజీ కాంబోస్‌ను సెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు రెహ్మాన్ మ్యూజిక్‌ను సెట్ చేశారు బుచ్చిబాబు. స్టార్ క్రికెటర్ ధోనీని కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయించేందుకు ఒప్పిస్తున్నారు.
ఇక ధోనీతో పాటే మెగాస్టార్ చిరుతో తన సినిమాలో స్టెప్ వేయించే ప్రయత్నం చేస్తున్నాడట ఈ డైరెక్టర్. అయితే ఇదే విషయాన్ని ఆయన నేరుగా చెప్పకపోయినా.. స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తన కిస్ కిస్ కిస్సిక్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో చెప్పారు. ఆర్సీ 16లో చరణ్, చిరుతో వర్క్ చేస్తున్నా.. డ్యాన్స్ చేయిస్తున్నా అంటూ ఉన్న విషయం చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో.. ఓవర్ నైట్ సెన్సేషన్ అయిన బుల్లి రాజు అలియాస్ రేవంత్ భీమలకు ఇప్పుడు టాలీవుడ్‌లో భారీగా డిమాండ్ ఉంది. బుల్లి రాజు పేరుతో ఈ బుడ్డోడు చేసిన పర్ఫార్మెన్స్ అందరికీ విపరీతంగా నచ్చడంతో.. ఈ బుడ్డోడి డేట్స్ కోసం మేకర్స్ క్యూ కడుతున్నారట. యాడ్స్‌లోనూ ప్రమోషన్స్ పరంగానూ ఈ బుడ్డోడి క్రేజ్‌ను వాడేందుకు మేకర్స్ పోటీ పడుతున్నారట. దీంతో రోజుకు లక్ష తీసుకుంటూ.. రెమ్యునరేషన్ రూపంలో గట్టిగా సంపాదిస్తున్నాడు ఈ బుడ్డోడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara: రూ.100 కోట్లతో ఇల్లు కమ్ స్టూడియో నిర్మించుకున్న నయన్
ఎయిర్‌టెల్ బాటలోనే జియో.. మస్క్‌తో రిలయన్స్ డీల్
ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి